Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంజ్ఞాధికారము

23


- సరసయతి. --

క. [1]అయహలు చఛజఝశషసలు
   నయసంయుత నణలు[2] రేచనా సరసగుణ
   ప్రియ యివి యొండొంటికి ని
   శ్చయము గ వళ్లయ్యె సర్వశాస్త్రవిధిజ్ఞా. 74

- సంఖ్యావాచక పదములు. -


క. [3] [4]హిమకర [5] కర [6] వైశ్వానర
   [7] సముద్ర [8] బాణ [9] ర్తు [10] ముని ౮ భుజంగమ ౯ నందా
   ద్యమితగణితోక్తి సంజ్ఞా
   క్రమమెఱుఁగఁగ వలయు నెన్నఁ గాఁ దగునెడలన్. 75

  1. ప - ద - లలో మాత్ర మున్నది.
  2. ద - నయసన్నుతవళ్లు, ఈపైని వివరింపఁబడిన యతులు గాక - క - లో
  3. అభేదయతి.
  4. క - డ - లలో మాత్ర మున్నది.
  5. వృద్ధియతి.
  6. ఆదేశయతి యను మూఁడును - ప - లో నివిగాక.
  7. నిత్యసమాసయతి.
  8. కాకుస్వరయతి.
  9. హశవర్ణ యతి.
  10. ప్రాసయతి యును నీయేడుయతులు నధికముగా వివరింపఁబడినవి. ఇవి ప్రక్షిప్తములని యె ఱుంగునది. మఱియును, పదివళ్లను వాని లక్ష్యములను జెప్పుచు రామస్తుతి గా నున్న భీమనచాటు వని కవిజీవితములో నీ క్రిందిపద్యము కనఁబడుచున్నది. సీ. అబ్జగర్భశివ 'స్వరా' థ్యపూజ్యపదాబ్జ కమలాక్ష మౌని 'వర్గ' ప్రసన్న, వైభ 'వాఖండ' దేవాదిదేవ కృపాబ్ధి యఖిలదిక్పాలక 'ప్రాది ' నిలయ. నుత పుణ్యహాస 'బిందు' యుతాసనాంభోజ యతిదయా 'ప్లుత' నిజాత్మా మహాత్మ, స్వచ్ఛపౌరుషకీర్తి 'సంయుక్త' సంచార మహిమ 'నెక్కటి' యైన మాన్యచరిత. గీ. పోల్పనీ 'పోలిక'కు దైవములు ను గలరె, 'సరస' నుతిపాత్ర భక్తరంజన చరిత్ర, 'ప్రాస' నిర్భిన్న చండతరాసురేంద్ర, యలఘు యతిగణ్య రఘురామ యఘవిరామ.