ఈ పుట అచ్చుదిద్దబడ్డది
22
కవిజనాశ్రయము
- సంయుక్తాక్షరయతి. -
క. [1]వరకృతులను సంయుక్తా
క్షరములలో నెద్ది యైనఁ జను వడి యిడఁగా
గురుబుధజనవరదాయక
స్మరసన్నిభసుభగమూర్తి మల్లియ రేచా ! 71
- ఎక్కటివడి. -
క. ధరజఞ లను నీరెండ
క్షరములు విన్నయది లేదు శబ్దము మొదలన్
[2]మరఱలవము లను నేన
క్షరములు తమతమకె వళ్లు కమలాధీశా ! 72
- పోలికవడి. -
క. పోలఁగ, పుఫుబుభులకు మూ
పోలికవడి శీల ముల్లమున కెన యనఁగా[3]
శీలం బుల్లం బనఁ గా
భూలోకం బమరలోకమున కెన యనఁగన్ . 73
- ↑ ద - క. వెలయఁగ సంయుక్తాక్షర , ములలో నెద్ది యును జనును మునుకొని వడిగా, నిలుపం దగుఁ బాదంబుల, నలఘుపరాక్రముఁడ రేచ యసదృశ విభవా. గీ. పాదముల నాది జడ్డ లైపరఁగుచున్న , వళ్లరెండక్షరంబుల వలసినదియు, నిలుపఁదగు వళ్లపట్టున నిశ్చలాత్మ, బుధజనప్రియ కవిరాజభూషణాంక.
- ↑ ద - యరమరవలవదు. బ - మరవన లను నీయే నక్కర.
- ↑ ద - మునమెత్తు రనన్.