ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సంజ్ఞాధికారము
25
ప్రాసం బుచితాక్షరవి
న్యాసంబుగఁ గృతుల రేచ నయ[1]తత్త్వనిధీ. 82
వ. మఱి త్రిప్రాసం బన మూఁ డక్షరములు ప్రాసం బిడి చెప్పునది. 83
క. దానమున సత్యమున నభి
మానమునం బోల్ప నీసమానము ధరణిం
గాన మనం ద్రిప్రాసము
[2]దాన మనోహర మగును బుధస్తుతచరితా! 84
వ. మఱి యనుప్రాసం బన్నది ప్రాసాక్షరంబు పెక్కెడల నిడి చెప్పునది. 85
క. విత్రస్తాఘపవిత్రచ
[3]రిత్ర జితత్రిదశవర ధరిత్రీసుతస
న్మిత్రాంబుజమిత్రగుణా
మత్ర యనుప్రాస మిదియ మల్లియరేచా ! 86
వ. మఱి యంత్యప్రాసం బన్నది మొదటిపాదము కడపటి యక్షరంబు నాలుగుపాదంబుల కడపట నిడి చెప్పునది. 87
క. జననుత భీమతనూజా !
సునయార్పితవిభవ[4]తేజ సుభగమనోజా !