ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సంజ్ఞాధికారము
15
నగి[1] యైనఁ దిట్టి యైనను[2]
బగనము గాకుండఁ గమలభవుఁడో శివుఁడో ? 50
ఏగణముఁ గదిసె నగణం
బాగణము సమస్తమంగళా వాప్తం బై[3]
రాగిల్లు నినుము పరుసపు[4]
యోగంబునఁ బసిఁడివన్నె నూనినకరణిన్ . 51
- అక్షరగుణదోషవిచారము. -
[5]శ్రీకారము గలపద్యము
ప్రాకటముగ లచ్చియొసఁగి పతి క నవరతా
స్తోకజయము లొనగూర్చును
మాకరుణారక్షి తాంగ మల్లియరేచా ! 52
[6]పాఫాబాభామాలను
పాపాక్షరసంజ్ఞ లేనుఁ బద్యము మొదలన్
రూపించి నిలిపి చెప్పిన
నాపద్దశలకును మూల మండ్రు కవీంద్రుల్. 53