పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

కవిజనాశ్రయము


- గణలింగములు. -

క. [1]ఇలఁ దగణ రగణ జగణం
   బులు పురుషగణములు, భగణమును యగణంబున్
   లలనాగణములు, నగణము
   పొలుచు మగణ సగణములు నపుంసకగణముల్ . 54

- అక్షరనిర్ణయము. -



క. [2]ఆదులు పదియే ననఁగాఁ
   గాదులు దా మిరువదేను గణుతింపంగా
   యాదులు పది యని చనఁగా
   నీదెస నక్షరము లమరు నేఁబది యనఁగన్. 55


  1. గ - లోమాత్ర మున్నది.


    ప - మగణము నగణముఁ బురుషులు

          జగణరగణసగణముల్ నిజంబుగ నింతుల్

          యగణము తగణము భగణము

          నగును నపుంసకము లుత్తమాదిఫలంబుల్ .

  2. గ - ఆదులు పదియా ఱనఁగాఁ, గాదులు తా మిఱువదేను (గాఁగన్ ) బరఁగున్ , యాదులు తొమ్మిది యనఁగా, నీదెస నక్షరము లనురు నేఁబది యనఁగన్. అం, అః, అనుస్వరములకు రుద్రుఁ డధిదేవత. సమదైవత్వము కలదు గనుక అః అను విసర్గాక్షరమును విడిచిన ఆదులు 15, కాదులు 25, కకార, షకార సంయుక్తం బయి భిన్న దైవత్వంబును బ్రత్యేకఫలదంబు నగుటం జేసి క్షతోఁగూడ యాదులు 10. అంతు 50 అక్షరములు.