Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కవిజనాశ్రయము

క. సభలం జెప్పిన విభవము
   రభలం జెప్పినను జెట్ట[1] రయమున వచ్చున్ ;[2]
   శుభ మగు రయలం జెప్పిన,
   నుభయము వర్ధిల్లునందు రుత్తమచరితా ![3] 46

క. రాజున కాదిన్ మగణము
   నోజం గదియించి సుకవు లొసఁగెడి పద్యం
   బాజులజయ మీఁ జాలదె
   తేజులు నేనుఁగులు భటులుఁ దేరులు సేనల్ .[4] 47

క. అనిలానలసంయోగం
   బనుపమకీలాక రాళ మగువహ్ని భయం
   బొనరించుఁ గర్త[5] గృహమున
   కను[6]మానము లేదు దీననండ్రు కవీంద్రుల్ .[7] 48

క. తగణంబు గదిసి చంపును,
   రగణము దా భీకరంపు రణ మొనరించున్ ,
   సగణం బిఁకనొకచిత్రము
   మగణముతోఁ గూడఁ గాలమానము పతికిన్. 49

క. [8]అగినిగణంబున కిరుదెస[9]
   సగణముతోఁ గూర్చి చెప్ప[10] సత్కవి మదిలో


  1. ద - చెటు.
  2. నిచ్చున్ , పాఠాంతరము.
  3. ద - గ
  4. ద - నేలన్.
  5. ద - గర్తృ.
  6. ద - నను.
  7. ప - కనుమానము లేదు దీనినంటకు రేచా!
  8. ఇందు , అగ్ని, భగ్నశబ్దములకు, ఆగిని నము ననుతద్భవములు కనుపడుచున్నవి.
  9. ద - గడ.
  10. ద - యె