ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సంజ్ఞాధికారము
13
క. రసలం జెస్పినఁ జి చ్చగు,
జసలం జెప్పినను దెవులు చయ్యన వచ్చున్ ,
తసలం జెప్పిన మే లగు,
మసలం జెప్పినను గర్త మండల మేలున్. 41
క. మునుకొని పద్యముఖంబున
ననిలగణం బిడిన నాయురారోగ్యంబుల్
కొనసాగు, దానిముందట
ననలగణం బిడినఁ బతికి నలజడి[1] సేయున్. 42
క. తగణంబు తొలుతఁ బిమ్మట
భగణంబును గదిసి యుండఁ బద్యము హృద్యం
బుగ రచియించినఁ గర్తకు
నగణితముగ నొసఁగు[2] నాయురైశ్వర్యంబుల్ . 43
క. నగణంబు గదిసి శుభకర
మగు యగణము గూడి యొసఁగు నర్థము సిరులున్;
నగణయుత మైన భగణము
జగణంబును గూడి భాగ్యచయముల నిచ్చున్. 44
క. రజతలఁగూడిన నూరక
గజిబిజి గావించుఁ, గావ్యకర్తకు సంప
ద్విజయములఁ జేయు భగణము,
నిజముగ నయరసల డాసి నిలిచినచోటన్. 45