ఈ పుట అచ్చుదిద్దబడ్డది
8
కవిజనాశ్రయము
- గణాధిదేవతలు. -
క. మ భ జ స న య ర తగణముల
కభిమతముగ భువియు శశియు నర్యమపవనుల్
ఋభునిలయ సలిల పావక
నభములు దేవతలు బుధజనస్తుత రేచా![1] 23
- గణఫలములు. -
క. శుభ సుఖ రుక్ క్షయ ధన కన
క భయైశ్వర్యములఁ జేయుఁ గ్రమమునఁ గావ్య
ప్రభులకుఁ గవులకు మొదలిడ
మ భ జ స న య ర తగణములు మల్లియరేచా ! 24
క. [2]సరసాన్న రుచిరభూషణ
పరితాప స్థానచలన బహుదుఃఖ రుజా
పరమాయు రచలలక్ష్మీ
కరములు మ య ర స త జ భ నగణములు వరుసన్. 25