ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సంజ్ఞాధికారము
7
క. [1]గగ మాయె రెండుగురువులు,
సగణంబును నొక్క లఘువు సల మనఁ బరఁగున్,
నగణము లఘువును నల మగు,
సగణంబును నొక్క గురువు నగ మనఁ బరఁగున్ . 19
క. [2]గగణ మన నొక్కగురు వగు,
లగణం బన నొక్కలఘువు లాలిత్యముగా[3] ,
వగణ మన లఘువు గురువును,
హగణం బన గురువు లఘు వహర్పతి తేజా. 20
క. [4]పరువడి గురులఘు లఘుగురు
గురులఘువులు గ ల వ హము లగున్ మఱి దీర్ఘ.
స్వరయుత మై యున్నగణా
క్షరములు[5] తద్గణము రెండుగా[6] నెన్నఁబడున్. 21
క. [7]భ ర త న గ నల సలంబులు
వరుసనె యియ్యాఱు నెన్న వాసవగణముల్ ;
మరి న హము లిసగణంబులు,
సరవిం దక్కినవి యెల్లఁ జంద్రగణంబుల్ . [8] - [9] 22
- ↑ ప - జ - లలో లేదు.
- ↑ ట - త - ద - జ - లలో లేదు.
- ↑ ప - లక్ష్యము గొనఁగా.
- ↑ క - డ - ద - లలో మాత్ర మున్నది
- ↑ ద - క్షరమును.
- ↑ ద - రెట్టిగా.
- ↑ క - డ - ద - లలో మాత్ర మున్నది. ప - లో నీ పద్యమునకు బదులుగా, భరతనగనలసలంబులు, సురపతినామములు నహలు సూర్యుని పేళ్లౌ, గురుముఖ లఘుముఖ చతుర , క్షరపంచాక్షరము లిందుసంజ్ఞలఁ బరఁగున్. అని యున్నది.
- ↑ క - ఉరుతరసత్కీర్తి హార యున్నతచరితా!
- ↑ ఈపద్యమునకు ముందు చ - జ - లలో నీక్రింది పద్యములు రెండును గలవు. (1) చను మగణము శ్రీనాథా, యనిన ముకుందా యనంగయ గణమురగణం,బన నొప్పుమాధవా యనఁ జనునోవరదా యనంగ సగణం బగుచున్ (2) కగణము శ్రీకృష్ణయనఁగ, నగుజగణంబును మురారియనఁగా జగతిన్ , భగణము శ్రీపతి యనఁగా, నగణం బగు నృహరి యనఁగ నలినదళాక్ష! ఇందు మొదటిపద్యము అనంతుని ఛందమునందును గలడు. జైనుఁడగుకవి విష్ణుప్రతిపాదకము లగుపద్యముల రచించుట యసంభవము . కనుక యీపద్యములు ప్రక్షిప్తము లని యూహింపఁ దగును.