Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంజ్ఞాధికారము

9

- గణవర్ణములు. -

క. గారుత్మత గోరోచన
   సారంగ పిశంగ కుముద చందన రక్తాం
   భోరుహ కనకప్రభలను
   నారయ మగణాది యగుగణావలి వొల్చున్.[1] 26

- గణగ్రహములు. -



క. ధరణిజ శశి రవి బుధ గురు[2]
   సురరిపుగురు మంద ఫణులు సొరిదిగ్రహంబుల్
   పొరి మ భ జ స న య ర త గణ
   సరణికి ఛందోమతంబు చర్చింపంగన్. 27

- గణకులములు. -



క. మగణంబు శూద్రకులజము,
   భగణం బగు వైశ్యజాతి, బ్రాహణజాతుల్
   సగణయగణములు, రగణము
   జగణము నృపజాతి యంత్యజంబులు నతలున్.[3] 28


  1. ట - జ - దారతను మభజసనయ రత గణంబులకున్ .
  2. ద - ధర బుధ శశి రవి కుజ గరు.
  3. క - తగణము యగణము రగణము, జగణము నృపజాతి యంత్యజము సగణంబౌ. జ - నగణయగణములు రగణము, జగణము నృపజాతి యంత్యజంబులుసతలున్ . ద - నగణ తగణములు యరలున్ , జగణము నృపజాతి యంత్యజము సగణం బౌ.