Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

6

2. అసమాన దాన రవితన
   యసమానోన్నతుఁడు యాచకాభరణుఁడు ప్రa
   ణసమానమిత్రుఁ డీకృతి
   కి సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్ .

ఈపద్యము లనన్వయముగా నుండుటచేత నందుఁ బేర్కొనఁబడిన భీమునకును గ్రంథమునకును గలసంబంధ మిట్టిదని నిర్ణయింప వలను గాక యున్నది.

కాకతీయ ప్రతాపరుద్రుని కాలమున వర్ధమానపురము నేలిన భీ రాజు తమ్ముఁ డైనగోకర్ణుఁ డీగ్రంథమును రచించి కల్యాణపురాధీశ్వరుఁ డైనజగదేకమల్లుని సేనాపతి యగురేచ భూపాలున కంకితము చేసె ననియు, వేములవాడ భీమకవిరచించినది నృసింహపురాణము, గాని, కవిజనాశ్రయము కాదనియు “ఆంధ్రులచరిత్ర"[1] మందు, చిలుకూరి వీరభద్రరావుగారు వ్రాసిరి; కాని, యావ్రాఁత కాధారము లేవియుఁ గనఁబఱిచి యుండలేదు. గ్రంథము రేచనకృత మని యొక్కటియు, భీమకవి కృత మని యొక్కటియు లోకమున రెండు ప్రతీతు లుండ నీ రెంటికి భిన్నముగ మూఁడవత్రోవఁ ద్రొక్కిన వీరభద్రరావుగా రందుకుఁ బ్రమాణ మేమియుఁ గనఁబఱుపకయుండుట వింతగా నున్నది. నిరాధార మగు నీ సిద్ధాంతమును ఖండింపఁ బూనుట

యనావశ్యకము గావున గ్రంథము భీమకవి కృతమే యనులోక ప్రతీతి ననుసరింతము.

  1. మధ్యయుగము. పుట-164.