పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

కవిజనాశ్రయము

లో పోతుకుచ్చి వేంకటసుబ్రహణ్యము ఎం. ఏ. గారును, ముద్రణకాలమందుఁ దప్పులు దిద్దుటలో మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారును సాహాయ్య మొనరించిరి, గాన, వారికి వందనము లర్పించుచున్నాఁడను.

- గ్రంథకర్తృనిర్ణయము. -

ఈ గ్రంథమునకుఁ గర్త యెవ్వఁడో, యిదియెప్పుడు పుట్టినదో నిర్ణయింపవలసి యున్నది. కవిజనాశ్రయుఁడు మల్లియ రేచసుకవి' యీగ్రంథమును రచించినట్లు గ్రంథమునం గవి ప్రతిజ్ఞలో నున్నది; కాని, "జ" యను ప్రతిలోఁ గల యవతారికలో, రేచన రచియించినట్లుగ వేములవాడ భీమకవి యీగ్రంథమును రచించిన ట్లున్నది. ఈయవతారిక యొక్క ప్రతిలోమాత్ర ముండుటచేఁ బ్రక్షిప్త మని తోఁపవచ్చును, గాని, కవితా వైఖరినిబట్టి చూడ నది ప్రక్షిప్తము కాదనియే నానమ్మకము. దీని కనుగుణముగా లోకమందెల్లెడల నీగ్రంథము వేములవాడ భీమకవికృత మనియే ప్రతీతికలదు. అప్పకవ్యాది లాక్షణికుల మతముకూడ నిదియే. అనేకము లగువ్రాఁతపుస్తకముల యట్టలమీఁద "భీమనఛందస్సు" అని వ్రాయఁబడి యున్నది. "అనవద్య కావ్యలక్ష” ణేత్యాదిపద్యమునకుఁ బూర్వము "బ" ప్రతిలో నీక్రిందిపద్యములు రెండున్నవి.

1. పరఁగిన విమలయశోభా
   సురనిరతుఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
   పరిణతుఁ డయ్యెను భూసుర
   వరుఁడు ప్రసాదోదితధ్రువశ్రీయుతుఁ డై.