పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

కవిజనాశ్రయము


-: రేచన విషయము :-

రేచన భీమన లెవ్వరో యేకాలమం దేదేశమం దుండిరో నిర్ణయింపవలసి యున్నది.

క. వేములవాడను వెలసిన
   భీమేశ్వరకరుణగల్గు భీమనుకవి నేఁ
   గోమటిరేచనమీఁదను
   నీమహిఁ గవులెన్న ఛంద మెలమి రచింతున్.

అను నవతారికాపద్యముం బట్టియు, దండకవృత్తలక్ష్యములోని "వణిగ్వంశచూడామణీ” యను సంబోధనముం బట్టియు రేచన వైశ్యుఁ డనియు, శ్రావకాభరణాంకుఁడును, వాదీంద్ర చూడామణి శిష్యుడును, "జినమతహితుడు” (పుట 37, పద్యము 45) నని యుండుటచే జైనుఁ డనియుఁ దెలియుచున్నది. మఱియు నితఁడు ధనికుఁ డనియుఁ, గవుల కాశ్రయుఁడనియుఁ గూడ నీగ్రంథమువలననే తెలియవచ్చుచున్నది. కాని యంతకంటె నధికముగా నతనింగూర్చి తెలిసికొనుట కాధారములు లభింపలేదు.

-: వేములవాడ భీమకవి జన్మభూమి నిర్ణయము. :-

భీమకవి గోదావరీమండలమందు కాకినాడకు సమీపమందున్న వేములవాడలో జన్మించె ననియు, వేములవాడ కామడదూరములో నున్న దాక్షారామగ్రామమున వెలసియున్న భీమేశ్వర ప్రసాదమున జన్మించుటచే భీమన యను నామ మతనికిఁ గలిగిన దనియు లోకములో నొక ప్రతీతి గల