ఈ పుట అచ్చుదిద్దబడ్డది
దోషాధికారము.
87
క. [1]జిననుతధర్మ మహింసయ
యనుమతమున వితతముగ గజాసురుఁ బాపం
బని చంపఁ డయ్యె నీశ్వరుఁ
డన నిది యాగమవిరోధ మనిరి కవీంద్రుల్. 33
క. అని యిట్టివి దశదోపము
లనఁ జనుఁ గృతి నివియ వెండి యతిశయతరమై[2]
చనుఁ గొన్నియెడల ధీరుల
మన మలరఁగఁ జెప్పి రేని మల్లియ రేచా! 34
క. జయదేవాదిచ్ఛందో
నయమున సంక్షేపరూపునం జెలువుగ మ
ల్లియ రేచన సుకవిజనా
శ్రయుఁ డీఛందంబుఁ జెప్పె జనులకుఁ [3]దెలియన్. 35
[4]గద్యము. ఇదివాదీంద్రచూడామణిచరణ సరసీరుహమధుకరాయమాన కవిజనాశ్రయ శ్రావకాభరణాంక [5]విరచితం బైన కవిజనాశ్రయచ్ఛందంబునందు దోషాధికారము. [6]
- ___________
- ___________
- ↑ చ-లో లేదు.
- ↑ చ-అనునీదశవిధదోషము, లనఁ గృతులం దివియ నెండి యతిశయకరమై.
- ↑ క-నొనరన్.
- ↑ డ-లో లేదు. దీనికిఁబూర్వము చ-లో నీక్రిందిపద్య మున్నది. సకలమహీజనంబులకుసంతస మయ్యెడు సౌఖ్య సంపదల్, సకలధరాధినాథులు నిజస్థితి దప్పక భూమి నేలఁగా, సకలకవీశ్వరుల్ పొగడఁ జంద్రుఁడు సూర్యుఁడు గల్గునంతకున్ , సకలధరిత్రలో వెలసి ఛందము తద్ద వెలుంగుచుండెడున్.
- ↑ చ-శ్రావకాభరణ.
- ↑ సమస్తాధికారమని పాఠాంతరము.