ఈ పుట అచ్చుదిద్దబడ్డది
86
కవిజనాశ్రయము.
క. [1]చినికెడుఁ బురినెమిళులు ముద
ముననాడెడు నింద్రగోపములు పాఱెడు నా
మనికాల మయ్యె నిలలో[2]
ననఁ గాలవిరోధదోష మనిరి కవీంద్రుల్ . 29
క. అసమగజము లందలములు[3]
కొసమాత్రకు దెచ్చు నట్టిగుఱ్ఱంబుల నం
కుస మిడక యెక్కు ననఁగా
హసనీయకళావిరోధ మనిరి కవీంద్రుల్ . 30
క. విను కరహీనుఁడు తగ వ్రా
సినపొత్తము తెచ్చి యొక్క చెవిటి వినఁగ బో
రనఁ జదివె మూఁగ సభలో
నన లోకవిరోధదోష మనిరి కమీదుల్. 31
క. [4]ఘసదండకాష్ఠకృష్ణా
జినములు సొగయింప నొక్కజినముని చనుదెం
చె ననఁగ సమయవిరోధం
బని కవులకుఁ జెప్పుఁ గవిజనాశ్రయుఁ డొనరన్. 32