Jump to content

పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దోషాధికారము.

83

   మిని! గవయ నేమి నోఁచితి
   నన విరహిణి కమరు నీక్రియన్[1] వ్యర్థంబై . 16

క. వన మిదియె కంటె తోడ్పడు
   మన వన మని యొండు రెండు మడుగులు గాఁ జె
   ప్ప నపార్థదోష మగు; నది
   చను మత్తోన్మత్త బాలచరితములందున్.[2] 17

క. తలరమి నీతో మేరువు
   అలవి యగుం గాక యొరులు అలవి యె వర ఉ
   జ్జ్వలతేజ యనఁగ సంధిం
   గలయనినొడువులు విసంధికము లనఁ బరఁగున్. 18

క. ప్రియమున నే నిన్ను మనః
   ప్రియుపాలికిఁ బుచ్చఁ బోయి బింబాధర ! పా
   డియె యిట్లు చేయ నని సం
   శయార్థముగఁ జెప్పఁ గృతుల సంశయ మయ్యెన్. 19

శ. భూభాగనభోభాగది
   శాభాగప్రవర్తికీర్తి సత్కృతికృతిచ్ఛం
   దోభంగ మిట్లుగా ఛం
   దోభంగం బనుప్రధానదోషం బయ్యెన్. 20


  1. క-నీక్రియలు.
  2. చూ. స్థిర మర్థశూన్య మెంబుదు , దురుక్తమిద నింతు పేళ్దొ డెల్లంపీనం, మరుళుం మదిరాసరవశ, శరీరమం పేళ్గు మఱిప నావం పేళ్లుం. (కవిరాజమార్గము.)