ఈ పుట అచ్చుదిద్దబడ్డది
84
కవిజనాశ్రయము.
క. [1]నొడువులకు సంధి నెగ్గులు
[2]వొడమిన శ్రుతి దుష్ట మయ్యె; భూతలమున ని
చ్చెడునెడ నినుమడి సిరి యనఁ,
[3]బడు నీజో డనినఁ జుట్టుప్రా వగుఁ గృతులన్. [4] 21
క. తుద వేఱు సేసి మఱి చ
క్కఁదనపుఁ దెనుఁగున నమర్చి కల వంబుజముల్
పదియు ననక కల వంబుజ
పది యని కృతిఁ జెప్ప వైరిపద మనఁ బరఁగున్.[5] 22
క. [6]వెలయఁగఁ [7](జెఱాకు) విలు గొని
[8]యలరమ్ములు చేతఁ బట్టి యంగజుఁడు విరా
హుల నేయు నేర్పుకడిమిన్
దొల మెలయఁగ ననినఁ గాకుదోషం బయ్యెన్. 23
- ↑ చ-నుడువు లగు సంధి నెగ్గులు.
- ↑ డ--పొడమిన నతిదుష్ట మయ్యె.
- ↑ చ-బడునిచ్చోటులను.
- ↑ ఈపద్యముతరుహత చ-లో, ఇందు కుదాహరణము. అవనిపుండు పుట్టె నమరకుజము భంగి, బుధులు గురులు నమల బుద్ధిఁదలఁప, నిచ్చు నష్టసుతుల నితనికి శ్రీవాసు, దేవుఁ డనినఁ జుట్టుప్రానకృతుల- అని యున్నది.
- ↑ చ - వైరివర్గం బరయన్ . వైరిపదమునకుఁ గన్నడమందరిసమాసమని పేరు. “పదవిధికన్నడకంస, క్కదక్క మిల్లాద్యరిందె సందుననఱిది, ర్పుదుబిరుదావళియో ళ్పే, శ్వుదు పెఱవఱొళాగదిదు విరుద్దసమాసం." (శబ్దమణిదర్పణము. ).
- ↑ డ- వెలసినచెఱాకువిలుగొని, యలవడఁ ద్రిప్పుచును వచ్చె నంగజుఁడును విరహుల నేయ ననినఁ గలిమిన్' , దొల మొలయఁగ ననినఁ గాకుదోషములయ్యెన్.
- ↑ మూలములో జిగురా కని యున్నది గాని యది పొరపాటు.
- ↑ క-యలమరు ద్రిప్పుచును వచ్చి యంగజుడు విరా, హుల నేయు సమలికలమని , దొలమిగులఁగ ననినఁ గాకుదోషం బయ్యెన్.