పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

కవిజనాశ్రయము.

క. వినుతచ్ఛందంబునఁ జె
   ప్పినయెడ నిలుపక కడలను దప్పి నిలుచుచొ
   ప్పునఁ జెప్పిన నది యతిభం
   గనామదోష మగుఁ గృతి జగజ్జనవినుతా! 12

క. వెలయంగ లక్ష్యలక్షణ
   ముల సిద్ధము లైనశబ్దములు గాని కుసం
   ధులు మొదలైనవిరూపో
   క్తు లెల్ల నపశబ్దనామదోషము లయ్యెన్. 13

క. పరఁగ నికారోపరిత
   [1]త్స్వరమ యికారంబుతోడ సదృశముగా నె
   వ్వరియి ల్లిది యి ట్లన కె
   వ్వరి ది ల్లి ట్లనఁ గుసంధివర్గం బయ్యెన్ . 14

క. స్వరగణము కూడి కృతిఁ ద
   త్స్వర మైననకార మొంది వ్రాయై[2] చనఁగా
   [3]దొర వీవు నజుఁడు ననకయ
   దొర వీవు న్నజుఁడు ననిన దుస్సంధి యగున్. 15

క. తనకడకు వలచి యేఁ బో
   [4]యిన నొల్లం డొల్లఁ డింక నే నాతనిఁ గా


  1. క - త్పరమయికారంబుతో ధ్రువం బమరఁగ నె.
  2. క-వ్రాలై.
  3. క-దొర యీ మనుజుం డనకయ, దొర యీమనుజుండు అనిన దుస్సంధి అనిన దుస్సంధి అగున్.
  4. క-యిననో ల్గొనఁ డొల్లఁ డింక.