ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు.
కవిజనాశ్రయము
[1]దోషాధికారము.
క. శ్రీశ్రితవక్షుఁడు విద్యా
శ్రీశ్రితముఖుఁ డఖిలజనవిశేషితకీర్తి
శ్రీశ్రితభువనుఁడు సుకవిజ
నాశ్రయుఁ డెఱిఁగించుఁ గృతుల నగుదోషంబుల్. 1
క. [2]రూపితపునరుక్తి వ్య
ర్థా పార్థ విసంధి సంశయ చ్ఛందోభం
గాపక్రమ యతిభంగ వి
రూపోక్త్యపశబ్దములు విరోధము కృతులన్. 2
- ↑ క-చ-డ-లలో నున్నది. ఈయధికారము ఛందశ్శాస్త్రమునకు సంబంధించినది కాక పోయినను, ప్రక్షిప్త మనుటకుఁ దగిన యితరకారణములు కనఁబడకుంటచే నీగ్రంథములోని భాగముగా గ్రహింపఁబడినది.
- ↑ చూ. 1 యతిభంగ మర్థశూన్యం | సతతనిరుద్ధార్థ ముక్తపునరుక్తార్థం ! చ్యుతయాథాసంఖ్యం వ్యవ! హితమచ్ఛందం 'విసంధికం నేయార్థం. 2 ఆగమసమయ న్యాయవి! భాగకళాకాల లోకదేశవిరుద్ధం| భోగివిషం బోల్ప్రాణ త్యాగమనాగినుగు మమళకృతివధు గినితుం. (కర్ణాటకవిరాజమార్గము.)