పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

కవిజనాశ్రయము.

క. అని యిట్లు దశవిధము లగు
   మునిమతమునఁ గావ్యదోషములు; వాని నెఱుం
   గనివాఁ డిప్పాట నెఱుం
   గు నుదాత్తకృతిప్రసంగగుణ దోషములన్. 3

క. మును సెప్పినశబ్దమె చె
   ప్పునేని కొఱ లేక శబ్దపునరుక్తి యగున్;
   మును చెప్పినయర్థమె చె
   ప్పునేని కొఱ లేక యర్థపునరుక్తి యగున్ . 4

క. దినకరుఁ డని మఱి దినకరుఁ
   డనఁగా శబ్దపునరుక్తి యనఁ జనుఁ గృతులన్ ;
   దినకరుఁ డని యాదిత్యుం
   డనఁగా నర్థపునరుక్తి యనిరి కవీంద్రుల్. 5

క. [1]అయనయసమేత ! కమనీ
   యయశా ! పునరుక్తి యయ్యు నమరుఁ బదావృ
   త్తియు మఱి వీప్సాభీక్ష్ణ
   క్రియాసమభిహార మైనక్రియలన్ గృతులన్. 6

క. విను వసతి వసతి దప్పక
   వన మనఁగా వీప్స, వచ్చి వచ్చి చనుం దా


  1. చూ:-దూరాభీక్షణవీప్సో! దారానుకృతిక్రియాసమభిహాంసమీ ! పోరుతరచాపళాదిగె! సారం బుధరిం పదక్కె యుగళోచ్చరణం. (కర్ణాటక శబ్దమణిదర్పణము)