పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

కవిజనాశ్రయము.

నమరఁ జేయుచుఁ జంద్రు నే డగుచోట
         నదికిన యేడుగణములలోనఁ
గ్రమము తప్పక యప్పాటఁ బెద్దయ
         క్కర మొప్పఁ గవిజనాశ్రయుఁడు సెప్పె. 25

- మధ్యాక్కరము. -



[1]సురరాజు సురరాజుఁ గూడి
          సూర్యుతో నొడఁబడి మఱియుఁ
గరమొప్ప నిప్పాట నాఱు
          గణములు మధ్యాక్కరంబు
విరచింపఁ బంపెఁ బ్రావళ్లు
          వెలయఁ గవిజనాశ్రయుండు
సురుచిరముగను సుశబ్ద
          శోభితం బగునట్లు గాఁగ. 26

- మధురాక్కరము. -



[2]రవి దివిజరాజ [3]గీర్వాణరాజ దేవాధిదేవ
కువలయప్రియు లిప్పాటఁ గూడ నేనుగణములు
నవిరళముగఁ[4] బ్రావడి మధురాక్కరంబు ధరలోనఁ
గవిజనాశ్రయుం డెఱిఁగించెఁ గవుల కింపుజనియింప. 27

  1. చ-డ-లలో నాల్గవపాదము లేదు.
  2. క-చ-డ-ద-లలో నున్నది.
  3. ద-రవియు దివిరాజు.
  4. ద-నవిరతముగ. గణనియమమున మధ్యాక్కర కన్నడములో దొరె (సమాన) యక్కరమునకును, మధురాక్కర నడువ(మధ్య)ణక్కరమునకును జేరియున్నవి. వానిలక్షణములు. సరసిజోదరగణ మెరడ జనుమల్లి నెరెదిక్కెమత్తం! సరసిజోదరగణమెరడ జనుమక్కెగణముమాఱక్కుం | సరసిజలోచనె! దొరెవెత్తగణదిందొరెవెత్త పెసరిం ! దొరియాగి పఁదుదు దొరెయక్కర మదనఱివుదీ తెఱదిం. జలజసంభవ గణమక్కె మొదలొళే నడువెమూఱుం | జలరుహోదరగణమక్కె కామాంతకగణమక్కుం | తిలకదంతిరె తలెయొ ళేబందిక్కె - కామబాణా! వళియపొంగె య్దె గణమక్కె నడువణక్కరకె సఖీ! (కర్ణాటకచ్ఛందోంబుధి.)