పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాత్యధికారము.

71

వ. అవి మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర, అల్పాక్కర లనునేను తెఱంగు లయ్యె. అందు,

- [1]మహాక్కరము. -


<poem>
   [2]అమరఁ బ్రావళ్లు రెండునాఁ జెలఁగి నా
                 ల్గగుచోట విరతి యాదిత్యుమీఁద
   నమరపతి రెండు మూఁడు నాల్గైదు నా
                 ఱగుతావులను నిల్పి సొబగుమీఱ

  1. దీనికి ముందు ద- లో జంద్ర సూర్యేంద్రగణవివరణ మున్నది. ప-ప్రతి యింతటితో సరి.
  2. ఈపద్యము ద-లో మాత్రమున్నది. ఈగణ నియమము కన్నడములోని పిరి ( పెద్ద) యక్కరగణనియమమునకుఁ జేరియున్నది చూ. మొదలొళజగణం కుందదె బక్కత్తమెయ్దుగణంగళె విష్ణువక్కుం! తుదియొ ళెంబ తాణదొళెల్లియుం కందర్పరిపుగణం నెలసినిలక్కె ! పదదొళెర డెంబసంఖ్యెయొళాఱఱొళజగణం సమవాయ మప్పాడక్కుం! సదమళేందునిభాననే! కర్తృవినిష్ట దినరిదు పిరియక్కరం (కర్ణాటచ్ఛ దోంబుధి),