పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

కవిజనాశ్రయము.

   వినుతమేలనమనుగీతి విస్తరంబుగాఁగ
   జననుతుండు చెప్పె వరవిశాలకీర్తియుతుఁడు. 22

- [1]ఆటవెలఁది ; తేటగీతి. -



   ఇనగణత్రయంబు నింద్రద్వయంబును
   హంసపంచకంబు నాటవెలఁది;
   సూర్యుఁ డొకనిమీఁద సురరాజు లిద్దఱు
   దినకరద్వయంబు తేటగీతి. 23

- అక్కరలు. -



క. [2]వినుతద్విత్రిచతుర్గురు
   జనితగణంబులు రవీంద్రచంద్రాఖ్యము లై
   చను నక్కరజాతుల కె
   ల్లను, నాదిమ(లఘువు) మొదల లఘు విడవలయున్. 24

  1. దీనికి ముందు ద-లో “అందు సమగీతులలక్షణంబు లెఱింగించెద" నని యున్నది.
  2. రెండు గురువులతోఁ బ్రస్తరించినచో నాలుగు గణములును, మూఁడు గురువులతోఁ బ్రస్తరించినయెడల నెనిమిదిగణములును, నాలుగు గురువులతోఁ బ్రస్తరించినఁ బదియాఱుగణములును బట్టును. వీనిలో మొదటి రెండేసి గణములు విడిచి, తక్కినగణములలో నాదిని లఘు వున్నగణముల యాదిని మఱియొకలఘు విడిన రెండుసూర్యగణములు, నాఱింద్రగణములుఁ, బదు నాలుగు చంద్రగణములు నైనవి. ఈగణములే యక్కరలయందు వచ్చును. విడిచిపెట్టిన యాఱుగణములు కలిపికొనినచోఁ గర్ణాటచ్ఛందోనుసారముగ నాలుగు బ్రహ్మగణములు, నెనిమిదివిష్ణుగణములుఁ, బదియాఱు రుద్రగణములు నగును. చూ:- ఎరడుం మూ ఱుం నాల్కుం, గురువిం ప్రస్తరిస లంబునిధి గబ ధరణీ,శ్వరగణ మొగగుమనర్కం, సరసిజభవ విష్ణు రుద్ర సంజ్ఞెగళక్కుం. కరపురవార్ధియాగె గురువాగిరె తద్గురువిందదోధసా, గిరె లఘుయుగ్మమాక్రమదె ముంతెసమం కడెవట్ట బిణ్పిదొళ్, బరెలమురొందె; పింతెలఘు; ముంతెసమం; మొదలిం తగుళ్దుపం, కరుహదళేక్షణే! గణ దునింతిడు సర్వలఘుత్వమప్పినం. (కర్ణాటచ్ఛందోంబుధి).