పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాత్యధికారము.

73

- అంతరాక్కరము. -



[1]ఇన సురేంద్ర చంద్రంబు లిప్పాట వచ్చి
పొనరి యుండంగఁ బ్రావళ్లు పూర్వభంగి
న నగణంబులు నాలుగింటం బెనంగ
ననుపమానాంతరాక్కర మయ్యె రేచ. float right

- అల్పాక్కరము. -



[2]ఇంద్రుండు మఱియొక్కయింద్రుఁ గూడి
చంద్రుతో నొడఁబడి చనిన సత్క[3]
వీంద్రు లల్పాక్కరం బిది యందురు[4]
చంద్రాస్య ! కవిజనాశ్రయకవీంద్రా ! [5] 29

  1. ప్రథమపాదమందు యతి విచార్యము. ఇది కన్నడమం దెడె (ఆంతరము)యక్కరకుఁ జేరి యున్నది - వనజసంభవగణమక్కె మొదలొళత్తల్ ! వనరుహోదరగణయుగళమదక్కె రుద్రనదఱంత్యదొళ్ బందిక్కె నాల్కెగణ! వినితె, వని తె! కేళ్ ఎడెయక్కరక్కి నినుం. (క. ఛం)
  2. చ-ఇంద్రుఁడు మఱియొక్క యింద్రుతోడఁ I జంద్రుతోఁ గూడఁగాఁ జనుసత్క.
  3. ద-చనిననుం గ.
  4. ద - బిది యనిరి.
  5. ఈలక్షణము కన్నడములో కిఱి (చిన్న) యక్కర లక్షణముం బోలియున్నది. పొడెయలరిర్బరుం మొదలొళిక్కె! జడెయ శంకరనొర్బం తుదియొళిక్కె1 మడది! కేళ్ మూడుగణమె సెదిక్కెగడ, కిఱియక్కరక్కిదె లక్షణం. (క. ఛం.)