పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

కవిజనాశ్రయము.

రతిప్రియవృత్తము. -
     [1]ఖ్యాతంబై మనజరగ ప్రజంబుతో సం
     గతంబుగా జభసజగంబు లూర్జిత
     శ్రీతన్వీప్రముదితచిత్త ! చిత్తజాభా !
     రతిప్రియం బనిరి తిరంబుగాఁ గవుల్. 135

[2]అజితప్రతాపవృత్తము. -
     సజసాగణాళివిక సన్నవనీ
     రజముఖా! నభజర వ్రజంబుతో
     నజితప్రతాప కుభయార్ధము లై
     నిజముగాఁ దగు సనుం దిరంబు గాన్. 136

పరస్థానార్ధసమవృత్తములలో. -

కోమలీవృత్తము. –
     జననుతకీర్తి! నజాయగణంబుల్
     ఘనంబుగా జభసజగవ్రజంబుతో

  1. క-ద-లలో మాత్ర మున్నది. ఈవృత్త మతిజగతీఛందస్సులోనిది. బేసిపాదములు ప్రహర్షిణీలక్షణమునకును సరిపాదములు రుచిఁనృత్త లక్షణమునకును సరిపడుచున్నవి.
  2. క-ద-లలో మాత్రమున్నది. ఇది జగతీఛందములోనిది. బేసిపాదములు ప్రమితాక్షరావృత్త లక్షణమునకును సరిపాదములు ప్రియంవదావృత్త లక్షణమునకును సరిపడుచున్నవి.