పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వృత్తాధికారము.

55

వ. అర్ధసమవృత్తంబు లన్నవి స్వస్థానార్ధసమవృత్తములు, పరస్థానార్థ సమవృత్తములు నా రెండుదెఱంగు లయ్యె. స్వస్థనార్ధసమవృత్తము లన్నవి యుక్తాదిషడ్వింశతిచ్ఛందంబులలో నొక్కచందంబున మొదలిపాదంబును [1]రెండవపాదంబును మూఁడవపాదంబును నొక్క వృత్తముగా వ్య త్యాసముచేసి చెప్పునవి. మఱి పరస్థానార్ధసమవృత్తము లన్నవి మొదలిపాదంబును మూఁడవపాదంబును నొక్కఛందంబున రెండవపాదంబును నాల్గవపాదంబును నొక్క ఛందంబునఁ జెప్పునవి.

స్వస్థానార్ధసమవృత్తములలో. --

నారీప్లుతవృత్తము. -
     [2]వారశ్రీసంసేవ్యవక్షా! మతాగా
     కారంబు నిత్తాజగగస్వరూపం
     బారంగం బూర్వాపరార్ధంబు లైనన్
     నారీప్లుతం బన్నది నామ మయ్యెన్. 134

  1. ద-నాఛందంబున నొక్కవృత్తంబున రెండవపాదంబును మూఁడవపాదంబును నాల్గవ పాదంబును నిట్లు వ్యత్యాసముగాఁ జేసిసి చెప్పునది. మూలము స్పష్టముగా లేదు. వృత్త మంతయు నొక ఛందమునకే చేరి యుండి బేసిపాదము లొకవృత్తమునకు ను సరిపాదములు వే ఱొకవృత్తమునకును సంబంధించి యున్నచో నది స్వస్థానార్ధసమవృత్త మగు నని భావము.
  2. క-ప-దలలో నున్నది. ఈవృత్తము త్రిష్టుప్ఛందములోనిది. బేసిపాదములు శాలినీవృత్తలక్షణమునకును సరిపాదము లింద్రవజ్రవృత్తలక్ష్మణనమునకును సరిపడును.