ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వృత్తాధికారము.
57
ననుపములై యుభయార్ధములందున్
బెనంగఁ గోమలియను పే రొడంబడున్ . 137
మనోహరవృత్తము. -
[1]చారిత్రనిదాన! తజావము లు
ద్ధురమయ్యె సకారచతుష్కముతో
నారంగఁ బడ న్నుభయార్ధములన్
విరచింప మనోహరవృత్తమగున్. 138
మణివితానకాంతివృత్తము. -
[2]సంబుద్ధీ! మసజంబుతో గకా
[3]రంబుతో రనమురంబునున్ వకా
రంబొందన్ గవిరాజితోభయా
ర్ధంబగున్ మణివితానకాంతికిన్ . 139
- ↑ బేసి పాదములు త్రిష్టుప్ ఛందస్సులోని కాంతావృత్త లక్షణమునకును , సరిపాదములు జగతీ ఛందస్సులోని తోటకవృత్తలక్షణమునకును సరిపడుచున్నవి.
- ↑ విషమపాదములు పంక్తిఛందస్సులోని శుద్ధవరాటివృత్తమునకును, సమపాదములు త్రిష్టుప్చందస్సులోని రథోద్దతవృత్తమునకును జేరుచున్నవి. ఇది క- ద- లలో నున్నది.
- ↑ రంబుతో రసరం బందుపైవకా, అని పాఠాంతరము.