Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

కథలు గాథలు


కొలట్ అనేవాడు తన వజ్రం ఖరీదు తాలూకు సొమ్ము తనకురాదనే అధైర్యంతో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ వజ్రం మళ్ళీ ఒక గ్రీకువ ర్తకుడి చేతిలో పడింది. అతడు దానిని తురుష్క సుల్తాను అబ్దుల్ హమీదుకు అమ్మాడు. అమ్మినరోజురాత్రే ఆ గ్రీకువర్తకుడు, అతని భార్యా,పిల్లలూ ఒక పర్వతం ప్రక్క ప్రయా ణం చేస్తూ అగాధమైన లోయలోబడి మరణించారు.

తురుష్క సుల్తాను పదచ్యుతి

తురుష్క సుల్తాను దగ్గర ఆ వజ్రానికి కాపలాకాసే సేవకుడి పైన ఆ సుల్తానుకు ఆగహం వచ్చి అతనిని బంధిఖానాలో పెట్టి చావ గొట్టినందువల్ల వాడికి పిచ్చి యెత్తింది. తరువాత ఆ సుల్తానుకు విశ్వాస పాత్రుడుగా వుండే ఖాజా వాడిని ఎవరో గొంతుక పిసికి చంపారు. తరువాత తురుష్క, యువజన పక్షంవారు ఆ సుల్తానుగారిని తోసిరా జన్నారు.

ఆఖరికి అమెరికా

తగాదాలో మళ్ళీ కొన్నాళ్ళదాకా ఆవజ్రం ఏమైనదో తెలియదు. 1911 లో అమెరికాలోని ఒక వజ్రాల కంపెనీలో మెక్లీన్ సతి అనే ఆమె దానిని కొన్నది. అప్పటినుంచీ ఆవిడ ఆ కంపెనీతో ఒక వ్యాజ్యం తగాదాలో చిక్కుకుంది. ఈ వజ్రం మీదనున్న అపఖ్యాతివల్ల దానిని కొనేటప్పుడు ఒక గమ్మత్తుషరతు నిర్ణయించుకున్నారు. కొన్న వాళ్లకు ఏదైనా ఆపదవ చ్చే సందర్భంలో వజ్రం వాపసు చేసే పద్ధతిని దానిని 60 వేల నవరసులఖరీదు అని మొదట అన్నారుగాని తుదకు 52 వేల నవరసు లే నిశ్చయించు కొన్నారు. 1919 మే నెలలో మెక్లీసు సతియొక్క ఏకైక పుత్రుడు కోటీ శ్వరుడి కులదీపము- పసిపాపడు తన దాయి దగ్గరనుంచి హఠాత్తుగా అవతలికి వెళ్ళి ఒక మోటారు బండిచక్రం కింద పడి చనిపోయాడు. *[1] తరువాత ఏమి జరిగిందో ఇంకా తెలియ లేదు.

.........................................................................................................

  1. The Curse of the Hope Diamond By Richard D. S. McMillan; (Great Stories of real life - George Newes Ltd.)