సీతారాముల శాపము
78
అనే యూథుజాతి వజ్రాల వర్తకుడిని పిలిచి తన వజ్రాన్ని 5 వేల సవ
రనుల కిచ్చి వేస్తా నన్నాడు. ఎలియాసన్ ఆలోచించి చెబుతానని తరు
వాత మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆ యువకుడు శోషిల్లి చచ్చి పడివున్నాడు.
ఎలియాసన్ ఆ వజ్రాన్ని సంగ్రహించాడు.అతని దగ్గర ఆ వజ్రం 1880 వరకూ ఉంది. తరువాత అతడు దానిని తామస్ హెన్రీ హోపు అనే ఆయనకు 18 వేల సవరనులకు అమ్మాడు. ఆ వజ్రం నిజానికి 30 వేలు చేస్తుంది. హోపుగారి తదనంతరం ఈ వజ్రం ఆయన వారసుడైన లార్డు ఫ్రాన్సిస్ హోపు ప్రభువునకు సంక్రమించినది. దీనికి అప్పటినుంచీ “హోపు వజ్రం” అని పేరు వచ్చింది.
హో పు ప్ర భు వు
ఈ వజ్రం వచ్చిన ముహూర్తాన హోపుప్రభువుకి అన్నీ కష్టాలే కలిగినవి. అతడు చాలా ఆస్తి నష్టపడి కాపురం చెడి మనోవ్యాధితో బాధపడ్డాడు. హోపుగారు 1894 లో మే యో హే అనే నటకురాలిని పెళ్లాడి ఆ వజ్రాన్ని ఆమెకు యిచ్చాడు. వజ్రం యొక్క పీడవల్లనే తనకు మనశ్శాంతి లేకుండా పోయినదనిన్నీ, తాను ఇంకొకనితో లేచి పోయినా ననిన్నీ ఆవిడ తరువాత చెప్పింది. హోపు ప్రభువు 1902లో ఆమెతో విడాకులు పొందాడు. ఈ లోపుగా అతనికి సొమ్ము అవస రమై ఆ వజ్రాన్ని విక్రయించాడు. తరువాత కొంత కాలందాకా వజ్రం ఏమైనదో తెలియదు.
ఇంకా కొన్ని దుర్మరణాలు
1908 లో ఈ వజ్రాన్ని రష్యా దేశపు కోటీశ్వరుడైన కనిటోవిస్కీ అనే ప్రభువు కొన్నాడు . అతడు ప్యారిసు నగరములోని ఒక నర్తకిని ప్రేమించి ఈ వజ్రాన్ని ఒక రాత్రి ధరించేటందుకు దాని నావి డకు ఇచ్చాడు.ఆ వజ్రాన్ని ధరించి ఆమె రంగస్థలం మీదికి రాగానే కనిటోవిస్కీకి నేమి తోచిందోగాని ఆమెను తన తుపాకితో కాల్చి వేశాడు. తరువాత యింకో రెండు రోజులలో ఈ కనిటోవిస్కీని ఎవరో పొడిచి చంపి వేశారు. ఆ వజ్రాన్ని ఈ ప్రభువుకు అమ్మిన వర్తకుడు