72
కథలు - గాథలు
లైంది. దాన్ని 'రాజు ధరించేటప్పటికి దాని నీలవర్ల కాంతులు చూసిఅందరూ
ఆశ్చర్యపడ్డారు. వజ్రం ధరించినందువల్ల రాజుగారికేమీ కీడు
రాలేదు. కాని దాన్ని ధరించిన ఆయన ప్రియురాండ్రకు ఆయన
స్నేహితులకు మాత్రం రాజాదరణము పోవడమో, గౌరవము పోవ
డమో, చెరలో దుర్మరణము చెందడమో, జరిగేది. అందువల్ల ఈ
వజ్రంలో ఏదో పిశాచ మున్నదనిన్ని పెట్టుకున్న వాళ్ళను నాశనం
చేస్తుందనిన్ని పుకారులు బైలు దేరినాయి
ఫ్రెంచిరాజు 16 వ “లూయీ" భార్య మేరీ అంటాయినెట్టు దీనిని ధరించింది. ఆవిడకు చాలా చిక్కులు వచ్చినవి. ప్రెంచి ప్రజా విప్లవంలో ఆ రాజు పద భ్రష్టుడైనాడు. ఈ రాణి ప్రాణాలను గోల్పో యింది. విప్లవం జరిగిన తరువాత 1792 లో తక్కిన జవాహిరితో పాటు ఈ వజ్రాన్ని ఎవరో అపహరించారు.
దుర్మరణాలు - దురదృష్టాలు
తరవాత కొంత కాలానికి వజ్రాల మచ్చులచావడి అనదగిన “ఆంస్టర్ డాం” లో "ఫాల్స్" అనే వజ్రాల వర్తకుడి దగ్గరికి ఈవజ్రం ఎలాగోవచ్చింది. అతనికిచ్చిన వాడు దానిని కొయ్యమన్నాడు. అతడు కొన్ని నెలలు కష్టపడి పని పూర్తిచేసేటప్పటికి అతని కొడుకు దానిని హరించి అమ్మివేసి ఆ సొమ్ముతో వ్యభిచారాలలోనూ, దుర్మార్గాల లోనూ పడి పాడై ఆత్మహత్య చేసుకొన్నాడు.
ఈ కుర్రవాడిదగ్గర ఆ వజ్రాన్ని దాని నిజమైన విలువలో 10వ వంతుకు ఫ్రాన్సిస్ బాయిలూ అనే ఫ్రెంచివాడుకొన్నాడు. అతడు దానిని ఫ్రాన్సులో అమ్మలేక , లండనుకుపోయి అమ్మదలచి అందుకు సొమ్ము లేక రహస్యంగా ఆ వజ్రంలో ఒక చిన్న ముక్కా కోయించి అమ్మి, కోసినందుకు కొంత సొమ్మిచ్చి మిగతాసొమ్ముతో" లండను వెళ్ళి ఆ వజ్రాన్ని తన జోడు మడమలో దాచుకొని తిరిగేవాడు. దానిని అమ్మడానికి భయపడి వీధులు ఊడ్చే పాకీపనిచేస్తూ జీవించేవాడు తిండి లేక మలమల మాడి ఆకలిబాధ భరించలేక ఆఖరికి ఎలియాసన్