పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


ఆ మర్నాడు ప్రొద్దున్న దివ్యవజ్రం పోయిన సంగతి తెలియగానే లబాయిలూ దిబాయిలూ ఎవరు ఎత్తుకుపోయివుంటారు ? అని అర్చకులు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. బిచ్చగాళ్ళను కట్టిన తాళ్ళను విప్పుతూవుండగా కొత్తగా వచ్చినవారు ఆ రాత్రి వెళ్ళిపోయారనే కేకలు వినబడ్డాయి.

శాపంయొక్క పీడ ప్రారంభం

టెవర్నియరు కోరిక సఫలమైంది. వజ్రం పోయిన సంగతి అర్చకులకు తెలిసేటప్పటికి అతడూ అతని అనుచరులూ తప్పించుకొని చాలా దూరం పోయారు.