పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


వెళ్లడం చాలా కష్టం. అయితే టెవర్నియరు ఫ్రెంచి దేశాన్నుంచి వచ్చిన ఒక గొప్పదొర అనిన్నీ, హిందూదేశాన్ని ఏలే చక్రవర్తికి స్నేహితుడనిన్నీ అతని ప్రఖ్యాతి అతనికంటె ముందుగానే పాకినందువల్ల అది సాధ్యం అయింది. అతడు గమ్యస్థానానికి దగ్గరికి వచ్చినకొద్దీ చాలా ధాతృత్వం కనబరుస్తూ దానధర్మాలు చెయ్యడం ప్రారంభించాడు. తనను ఒక మహారాజు అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారని టెవర్నియరే అన్నాడు.

విదేశీయుడిని - అందులో తెల్లవాడిని - దేవాలయంలోనికి సులభంగా రానివ్వరుగాని టెవర్నియరుకు ఇది సులభంగా సాధ్యమైంది. దేవాలయంలో కాలుపెట్టగానే టెవర్నియరు ఎంతో భక్తిపరుడిలాగ సాష్టాంగపడి దేవుడికి నమస్కరించాడు. ఈ సీతారాములను చూడలేక కళ్ళు మిరుమిట్లు క్రమ్మినాయేయో అనేటట్లుగా తన అరచేతి వేళ్లను కళ్ళకు అడ్డముపెట్టికొని ఆ వేళ్ళసందులనుంచి తాను అపహరించదలచిన అపూర్వ వజ్రం ఎక్కడవుందో కనిపెట్టాడు.