జగద్గురు తత్త్వబోధకస్వామి
61
బించాలనికూడా అతడు అన్నాడట. అంతట నోబిలీ ఒక స్వాములవారిలాగ తయారైనాడు.
లెయిర్జియోగారి వుత్తరంలో నొబిలీ దుస్తుల వర్ణన కనబడుతూ వుంది. ఈయన ఒక పొడుగైన కాషాయపుటం గీని ధరించి ఒక కాషాయపు ఉత్తరీయాన్ని కప్పుకునేవాడు. ఆ రంగు గుడ్డతోనే తల కొక తలపాగాను చుట్టుకునేవాడు. కాళ్లకు పావుకోళ్లు తొడుగుకునేవాడు. ఇంతేకాదు. ఈ దేశంలో బ్రాహ్మణులూ, క్షత్రియులూ ఉపనయనంలో ధరించే ఉత్తరజందెముల వంటివి మూడు బంగారు పోగులూ, రెండు వెండిపోగులూ గల ఉత్తరజందెములను వేసుకొని వాటిమధ్య మెడలో ఒక శిలువనుకూడా ధరించేవాడు. దీనికి క్రైస్తవమతానికి సంబంధించిన ఒక అంతరార్ధం వున్నదని అనేవాడు. కొన్నళ్లైనతరువాత జగద్గురువు ఇలాంటి జందము వేసుకోనక్కరలేదని నోబిలీ దానిని విసర్జించాడు.
వి చి త్ర వే దాం త ము
నోబిలీ చేసే మతబోధ, ప్రచారము, చాలా చిత్రంగావుందని హిందువుల మతగ్రంధాలలోని కధలలోను సిద్ధాంతాలలోను తన కుపయోగించే సంగతులు తీసుకొని వాటిని బట్టి మతబోధ చేసేవాడు. ఈ హిందూదేశీయులకు నాలుగు వేదములున్న వనిన్ని, అందులొ ఒకటి పొయినదనిన్నె నోబిలీ విన్నాడు. ఇప్పుడున్న వేదాలలో బ్రహ్మ, విష్ణు మహేశ్వరులనుగూర్చి చెప్పబడిన వనిన్ని నాల్గవదానిలో కేవలమూ మోక్షమార్గమే వివరింపబడినదన్ని, కేవలము ఇప్పుడున్న వేదాలవల్ల తరించలేరనిన్ని, ఆ నాలుగవ వేదమును ఉద్దరించగల బుద్దిమంతు డెవ్వడూ లేడని కొందరు అనుకుంటున్నారనిన్ని విన్నాడు. ఈ ప్రజలు మోక్షమార్గమును వాంఛిస్తారు. అపచారాలకు ప్రాయశ్చిత్తాలను చేసుకుంటారు. దానధర్మాలు చేస్తారు. తమ విగ్రహాలకు అతిభక్తివిశ్వాలతో మ్రొక్కుతారు. అందువల్ల వీరినమ్మకాలను పురస్కరించుకొని నోబిలీ పనిచేయ దలచాడు. తాను మోక్షమార్గమును బోధించడానికి వచ్చాననిన్నీ, తమ బ్రాహ్మణులు పోయినదని