జగద్గురు త్త్వబోధక స్సామి
47
తెలుగువారి చేతులలోనే ఉండి కన్యాకుమారివరకూ గల దక్షిణదేశమంతా తెలుగు మయంగా ఉండేది. ఆ కాలంలో ఈ దేశంలో ఉండిన పాశ్చాత్యులు చాలామంది ఈ సంగతిని గురించి వ్రాసియున్నారు.
విజయనగర సామ్రాజ్యం బలహీనమైనకొద్దీ సామంత మండలేశ్వరులు బలవంతులై కొంతకాలమునకు సామంతరాజులై తరువాత స్వతంత్రులైనారు. తంజావూరు, మధురలనేలిన నాయకరాజులు చోళపాండ్యరాజు లని ప్రసిద్ది చెందారు. వీరుకూడా విద్యానగర ప్రభువులలాగనే తెలుగు కవులను, గాయకులను, పండితులను పోషించిప్రజారంజకంగా దేశాన్ని పరిపాలించారు. వీరి కాలంలో సంగీత సాహిత్యాలు, కళలు సర్వతోముఖంగా అభివృద్ధి చెంది ఇప్పటికీ వారి కీర్తిని వేనోళ్ల చాటుతున్నవి.
వెంకటపతి దేవరాయల కాలంనాటికి కుమార కృష్ణప్పరాయలుడనే లింగయనాయకుడు మధురకు సామంత మండలేశ్వరుడుగా ఉండేవాడు. అతడును 1602 లో చనిపోగా ఆయనకుమారుడు ముద్ధుకృష్ణప్ప నాయుడు 1624 వరకూ పరిపాలించాడు. తరువాత ముద్ధు వీరప్ప నాయుడు 1624 వరకూ పరిపాలించాడు. వీరప్పనాయకుని కాలంలో వెంకటపతిదేవరాయలు చనిపోగా వీరప్పనాయకుడు మధురకు స్వతంత్రరాజైనాడు. ఆయన తరువాత తిరుమల నాయకుడని ప్రసిద్ధిచెందిన 'మహామాన్య రాజశ్రీ తిరుమలశౌరి అయ్యలుగారు ' 1623 లో మధురరాజ్యానికి పట్టాభిషిక్తుడై 1625 వరకూ పరిపాలించారు.
పోర్చుగీసువారు - క్రైస్తవ మత ప్రచారము
మన దేశానికి వర్తకం చెయ్యడానికి మొట్టమొదట వచ్చిన ఐరోపాజాతివారు పొర్చుగీసువారు. వీరు మన దేశరాజులను, వారి సామంతులను ఆశ్రయించి పశ్చిమ సముద్రతీరంలో అక్కడక్కడ కొన్ని వర్తక స్థానాలను ఏర్పరచుకున్నారు. వర్తకులతో పాటు రోమను క్యాతలిక్కు శాఖను చెందిన జెస్సూటులనే పోర్చుగీసు క్రైస్తవ మిష