46
కథలు - గాథలు
ఖోజాజమాత్ ఖానాలలోఈగ్రంధాన్ని చదివేటప్పుడు ఖోజాలందరూ ఈ పదియవ ప్రకరణాన్ని అతి భక్తితో వింటారు. ఈ ప్రకరణం మొదలుపెట్టగానే సభవారంతా లేచి అది పూర్తిఅయ్యేవరకూ అలాగ నుంచుంటారు. పరమపూజ్యుడైన మౌలాఅలీ నామం ఉచ్చరించినప్పుడల్లా అతి భక్తితో ప్రణమిల్లుతూ వుంటారు.
ఇలాగ మౌలా ఆలీ దశావతారాలలో ఒక అవతారమైనాడు !
5. జగద్గురు తత్త్వబోధక స్వామి
[రాబర్టో డీ నోబిలీ అనే క్రైస్తవ ఫాదరీ చరిత్ర]
దక్షిణ దేశాన్నంతా ఏకచ్చత్రంగా పరిపాలించిన విద్యానగర చక్రవర్తులలో గడపటివారగు 1885 - 1914 మధ్య రాజ్యంచేసిన వెంగటపతి దేవరాయ మహారాజులు ఆయన కొన్నాళ్ళు పెనుగొండను, తరువాతి చంద్రగిరిని రాజధానిగా చేసుకుని దేశపరిపాలన చేశాడు. ఆయన రాజ్యం కృష్ణానదికి దక్షిణాన కన్యాకుమారివరకు వ్యాపించి యుండేది. శ్రీరంగపట్నంలో ఆయన తమ్ముడి కొమారుడే రాజప్రతినిధిగా వుండి మైసూరు కర్నాటక రాజ్యాలను పరిపాలించేవాడు. 1612 లో రాజఓడయరు మైసూరుకుపరిపాలకుడైనాడు. బేదనూరు, లేక ఇక్కేరీలో ఒక సామంత మండలేశ్వరు డుండేవాడు. ఇలాగే దక్షిణదేశంలో తుండీరానికి జింజిలోను, పాండ్యానికి మధురలోను, చోళదేశానికి తంజావూరులోను, సామంత మండలేశ్వరులు ఉండి పరిపాలించేవారు.
విజయనగర సామ్రాజ్యము నేలిన చక్రవర్తులు తెలుగువారే అయినందువల్లను, వారి కాలంలో వివిధ ప్రాంతాలను పరిపాలించిన రాజ ప్రతినిధులు, సామంత మండలేశ్వరులు రాజబంధువులుగానో, తెలుగునాయకులుగానో ఉంటూవున్నందువల్లను దేశప్రభుత్వమంతా