పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తురకల దశావతారములు

89


అన్యాయంగా చంపారు ఇంకొక కొడుకును భార్యను సోదరిని ఎత్తుకొనిపోయారు. హుస్సేను తలను క్యూఫాలో ఊరేగించారు.

షియాలు - సున్నీలు

అబుబేకరు ఓమరు ఓస్మానులను అంగీకరించక ఆలీని ఈశ్వరుని అవతారమని నమ్మి ఆయన వంశీయులను ఇమామూలుగా గౌరవించే వారే షియాలు. ఆయనను ఒక కాలీఫుగా మాత్రమే పరిగణించేవారే సున్నీలు. క్రమక్రమంగా ఈ రెండు తగల అచారవ్యవహారాలు భేదించి విరోధాలు ఏర్పడ్డాయి. అని కుల కక్షలుగా పరిణమించాయి.

సున్నీలు ఖొరానులోని ధర్మాలనేగాక సున్నత్ అనె మహమ్మదుగారి జీవిత విధానాన్ని కూడా ప్రమాణంగా అంగీకరిస్తారు. సున్నీలు రోజుకు అయిదుసార్లు ప్రార్ధన చెస్తారు. షియాలు రోజుకు మూడుసార్లే ప్రార్ధన చేస్తారు. సున్నీలు ప్రార్ధించేటప్పుడు చేతులు ముడుచుకొని రొమ్ముమీద వుంచుకొంటారు. షియాలు చెతులు ప్రక్కకు వాల్చుకొనే వుంటారు. షియాలు మహమ్మదుగారి అల్లుడైన ఆలీగారినీ, కొమార్తె అయిన ఫాతిమాను ఈశ్వరాంశ సంభూతులుగా పరిగణిస్తారు. మహమ్మదుగారి చిన్నభార్య ఆయేషా బంధువులైన అబుబేకరు. ఓమరు ఓస్మానులు అక్రమంగా కాలీఫులైనవారని అసహ్యించుకుంటారు. ఈ ముగ్గురు కాలీఫులను సున్నీలు శుక్రవారపు ప్రార్ధనలలో భక్తితో స్మరిస్తారు. వారి పేర్లు పవిత్రంగా యెంచి మశీదు గోదలమీద చెక్కిస్తారు.

ఆలీగారి కొమారుడైన హుస్సేనుగారు మెదినానుంచి క్యూఫాకు పోతూ వుండగా హుస్సేనుగారిని కెర్భాలాపట్నంలో వధించిన ఘోరకృత్యాన్ని స్మరిస్తూ షియాలందరూ మొహరం నెలలో దు:ఖపడుతూ ప్రార్ధనలు చేస్తూవుంటే సున్నీలు దీనిని వెక్కిరిస్తూ ఆతతాయులచేత పులులు మొదలైన మృగాల వేషాలు వేయించి మొహరంలో అల్లరి చేస్తూ దానిని ఒక పండుగలాగ చేస్తారు. ఇదేమనదేశాలలొ పులివేషాల చరిత్ర.