పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


  కెర్బలాను పవిత్ర ప్రదేశంగా యెంచి అక్కడి మట్టియుండల తావళాలతో షియాలు జపంచేస్తారు. ఆ మట్టిని నీళ్ళలొకలిపి తాగుతారు. సున్నీలు ఇది చూసి అసహ్యించుకుంటార్.
ఆ గా ఖా ను
  ఆలీ దగ్గరనుంచ్ ఏడవతరమువాడైన ఇస్మేల్ అనే మతగురువు భగవదవ తారమని షియా ఇస్మేలీ తెగవారి విశ్వాసం.

  హస్సన్ బిన్ సబా అనే అతడు అరబ్బీ దేశీయుడు. అతడు షియామతంవాడు. ఈజిప్టుదేశం ముఖ్యపట్టణమైన కైరోలో ఇస్మేలీ మత సిద్ధాంతా లన్ బాగా అభ్యసించాడు. అప్పుడు పారశీక దేశంలో సున్నీమతం ప్రబలంగా వుండేది. ఇతడు ఒక కొండమీద స్థావరం యేర్పరచుకొని క్రీ.శ. 1090 ఆ ప్రాంతంలో హింసాపద్దతులతో బలవంతంగా మతప్రచారం చెయ్యడం నారంభించాడు. మతవిరోధులను చంపే విధానాలను ప్రారంభించాడు. అతని తరువాత నాలుగవ ('ఇమాం ') మతగురువు 'జాకరేసలాం ' అనే ఆయన కూడా ఆపద్ధతిలోనె మతప్రచారం చేశాడు. తాను ఇస్మేలీ మత గురువుయొక్క వంశంలో ఏడవ తరంవాడనని 'దైవాంశసంభూతుడనని ప్రచురించుకుని ఇతడు ప్రఖ్యాతిచేందాడు. ఒక సందర్భంలో ఇతని చర్యలు తక్కిన మహమ్మదీయులకు చాలా హెయకరంగా తొచాయి. ఇతడు రంజాను 17 వ రోజున అలమత్తుకోటలో ఒక వేదికమీద కెక్కి తాను భగవంతుని ప్రతినిధి నని ప్రచురించి సామాన్య మహమ్మదీయ మతసిద్దాంతాలను రద్దుచేసి ఆ పవిత్రదినాన్ని 'ఇమాం ' గారికి దివత్వం సిద్ధించినదినంగా పరిగణించాలన్నాడు. యెధెచ్చగా పందిమాంసం కూడా తినవచ్చుననిన్ని తప్పతాగవచ్చుననిన్ని ప్రకటీంచాడు. తరువాత నాలు గేళ్ళలో ఇతనిని ఎవరో వధించారు.
  1866 వ సంవత్సరంలో బొంబాయి సుప్రీం కోర్టులో వచ్చిన వ్యాజ్యంలో 1 వ ప్రతివాది అయిన మహమ్మదు హుస్సేన్ హుస్సేనీ అనే పేరు గల ఆగాఖాను గారు ఆ యిమాముల వంశీయు డేనని