పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

కథలు గాథలు

4. తు ర క ల ద శా వ తా ర ము లు

మహమ్మదీయులలో షియాలు, సున్నీలు, అనే రెండుతెగలున్నవి. మహమ్మదు ప్రవక్తను గౌరవిస్తూ ఖొరానును పవిత్రంగా ఎంచే రెండువిషయాలలో తప్ప మరే విషయాలలోనూ సున్నీలకూ షియాలకూ సామరస్యం లేదు. ఒకరిని చూస్తే ఒకరికి పరమద్వేషం.

మహమ్మదుగారి కొమార్తె అయిన ఫాతిమాకు, ఆయనచిన్న భార్యాఅయిన ఆయేషాకునుగల క్రోధజ్వాలలు ప్రజ్వలించి మహమ్మదీయ ప్రపంచాన్ని షియా సున్నీలనే రెండు కులాలుగా చీల్చినవి. ఈ రెండు తగలమధ్య వచ్చే తగాదాలలో రక్తపాతం కూడా కలుగుతూవుంటుంది. చిన్న చిన్న మహమ్మదీయ తెగలవారు వీరి మధ్య నలిగిపొతూ వుంటారు. మన దేశంలో సున్నీలే అధికసంఖ్యాకులు గనుక వారిమధ్య జీవించే స్వల్పసంఖ్యాకులుగ వుండే మహమ్మదీయ తెగలవారు తమ కేమి కీడు మూడుతుందో అనేభయంతో వుంటారు.

భగవంతుని దూతయైన మహమ్మదు ప్రవక్త తన తరువాత ఎవరు మతగురువుగా వుండవలసినదీ నిర్ణయించకుండా క్రీ.శ. 632 లో చనిపోయాడు. ఆయన కొమార్తె ఫాతిమయొక్క భర్తయున్నూ, ఆయన ప్రధమశిష్యుడున్నూ అయిన ఆలీ ఆయన తరువాత కాలిఫు అవుతాడని అందరూ అనుకున్నారు గాని మహమ్మదుగాని చిన్నభార్య ఆయేషా ఫాతిమాపట్ల విరోధం వహించి ఒకకక్ష లేవదీసి తనతండ్రి అబుబేకరును కాలీఫుగా ఎన్నుకొనేటట్లు చేసింది. ఆయన తరవాత ఓమరు, ఓస్మాను, కాలిఫు లయ్యారు. క్రీ.శ.655 లో ఓస్మాను చనిపోయిన తరువాత ఆఖరికి ఆలీ కాలీఫుఅయినాడు గాని 661 లో అతనిని ఒక మహమ్మదీయుడు వధించాడు. అతనికి హస్సను, హుస్సేను లని ఇద్దరు కొమాళ్లు. హస్సనుకు విషం పెట్టించి చంపారు.

ఇరాకు అరబ్బీ దేశముల (మొసపొటేమియా) రాజు ఆహ్వనం మీద హుస్సేనుగారు మెదీనానుంచి క్యూఫాకు వెడుతూ వుండగా దారిలో 'కెర్బాలా ' దగ్గర ఆయనను ఆయనకుమారుని ఆరాజు సైనికులే