పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

34

కథలు గాథలు


గవర్నరు జనరలైన డల్ హౌసీ ప్రభువు 1848 లో ఢిల్లీకి వెళ్లినపుడు చక్రవర్తిని దర్శించడమే తనకు పరువు తక్కువగా యెంచి వెళ్లడము మానివేశాడు. డల్ హౌసీ మెల్లిగా చక్రవర్తికిని నవాబులకును చూపవలసిన మర్యాదల నన్నిటినీ పూర్తిగా తీసివేశాడు.

1765లో దివానిగిరీని సంపాదించినది మొదలు 1858లో కంపెనీవారి పరిపాలన రద్ధు చేయబడి ఇంగ్లీషు రాణీ ప్రభుత్వము స్థాపించబడు వరకూకూడా ఇంగ్లీషు వర్తక కంపెనీవారు జారీచేసిన వుత్తర్వులలోనూ, ప్రకటనలలోనూ మొగలాయి చక్రవర్తి సార్వభౌమత్వమునకు లోబడితాము పరిపాలిస్తూవున్న సంగతిని తెలిపే ("Under the king's realm and the Company's rule") అనే ఇంగ్లీషు మాటలను వాడుతూ వచ్చారు.

ఇంగ్లీషు వర్తకకంపెనీవారు చివర వరకూ మొగలాయి చక్రవర్తిగారి సార్వభౌమత్వాధికారానికి లోబడియే హిందూదేశాన్ని పరిపాలించారు గాని క్రమక్రమముగా ఆయన రాజచిహ్నాలను దర్జాలను తొలగించారు.

1803 లో లేక్ సేనాని ఢిల్లీనగరాన్ని ముట్టడించి షాఆలం చక్రవర్తిని మహారాష్ట్రుల స్వాధీనం తప్పించి ఇంగ్లీషు కంపెనీవారి స్వాధీనంలోకి తెచ్చినప్పుడు అదివరకు సింధియా చేసినట్లే ఢిల్లీనగరాన్ని చక్రవర్తి పేరిటనే పరిపాలించ సాగినారు. చక్రవర్తిన్నీ అంతకు ముందు సింధియాకు గొప్ప బిరుదును ప్రసాదించినట్లే దాని తరువాత గొప్ప బిరుదైన సంసాం ఉద్దౌలా అజ్ఘార్ ఉల్ మల్కు ఖాన్ దేరాన్ ఖాన్ పత్తేసింగ్ అనే గొప్ప బిరుదును ఇప్పుడు లేక్ సేనానికి ప్రసాదించాడు. ప్రపంచంలోకల్లా ప్రఖ్యాతి జెందిన మొగలాయి చక్రవర్తుల వంశీకుడైన పాదుషావల్ల ఇలాంటి బిరుదులను పొందడము తనకు చాలా గౌరవమని లేకు సేనాని యెంచి దానిని సంతోషముతో శిరసావహించాడు.

చక్రవర్త్రికి ఇంగ్లీషువర్తక కంపెనీవారు సాలియానా ఫించనుగా కొంతసొమ్ము ఇస్తూవున్న మాటవాస్తవమే గాని ఇది కప్పము