30
కథలు గాథలు
"దివానిగిరీ"
వంగరాష్ట్రంలో ప్రభుత్వాధికారాలను కంపెనీవారికి చేజిక్కించాలనే వుద్దేశ్వం కంపెనీయుద్యోగులు చాలామందికి కొంతకాలం నుంచి కలిగింది. ఆఘనకార్యం సాధించిన గౌరవం క్లైవుకే దక్కింది.
ఆకాలంలో దేశంలో ప్రతినవాబున్నూ చక్రవర్తి పేరిటనే ప్రభుత్వం జరుపుతూ వుండేవారు. ఏరాజ్యతంత్రం ప్రయోగించాలన్నా చక్రవర్తి పేరుతో ఒక ఫర్మానా పుట్టుతూ వుండేది. చక్రవర్తిని చేజిక్కించుకొన్నవాడిదే రాజ్యంగా సాగేది. అందువల్లనే అయోధ్య నవాబు వజీరు చాలా బలవంతుడైనాడు. 1763 లో క్లైవు రాగానే చేసిన పని అయోధ్య నవాబుతోనూ చక్రవర్తితోనూ రాయబారాలు సాగించి కంపెనీవారికి లాభకరమైన సంధియేర్పాటులు చేయడమే.
షా ఆలం చక్రవర్తి అలహాబాదు మకాములో వుండగా క్లైవు స్వయముగా ఆయనను దర్శించి ఆయనవల్ల కంపెనీ వారికి వంగరాష్ట్రానికి బీహారు ఒరిస్సా పరగణాలకూ దివానిగిరి అధికారాలను సంపాదించాడు. చక్రవర్తి సంరక్షణకోసము అలహాబాదులో ఇంగ్లీషు సైనికదళము నుంచేటట్లున్నూ కంపెనీవారు వంగరాష్ట్రం బీహారు ఒరిస్సా పరగణాలలో దివానుగా వుండి శిస్తులను వసూలు చేసి పరిపాలన జరిగించుటకున్నూ కంపెనీవారు చక్రవర్తికి సాలుకు 20 లక్షల రూపాయలు చెలీస్తూ ఉండేటట్లున్నూ ఏర్పాటు జరిగింది ఈదివానిగిరీతోపాటు దక్షిణదేశంలో ఉత్తరసర్కారు జిల్లాలనుకూడా కంపెనీ వారికి దయచేస్తూ షాఆలం చక్రవర్తి ఫర్మానా జారీచేసినాడు.
చక్రవర్తియిచ్చిన దివానిగిరీని బట్టి కంపనీవారి (సివిలు) ప్రభుత్వాధికారాలన్నీ చలాయించడానికి వీలున్నప్పటికి వెంటనే అలాగ జరిగించక పన్నులు వసూలు మాత్రం తాము చేస్తూ మిగతా ప్రభుత్వాధికారాలన్నీ నవాబుక్రింది వుద్యోగుల ద్వారానే జరగనిచ్చారు. దీనికి కారణం వెంటనే తా మీప్రభుత్వాధికారాలన్నీ చలాయించేటట్లైతే చాలా పెద్దసిబ్బందిని నియోగించి చాలాసొమ్ము ఖర్చుపెట్టవలసివస్తుం