చక్రవర్తికి శిక్షవిధించిన దివానులు
31
దనిన్నీ పైగా తమతోడి పాశ్చాత్యవర్తక కంపెనీలకు కన్నుగుట్టి తమ ఆదాయానికి భంగంరావచ్చుననిన్నీ దూరాలోచనతోనే ఇంగ్లీషు వర్తకకంపెనీవారు ఈవిధంగ ప్రవర్తించారు. దీనివల్ల ప్రభుత్వం యొక్క బాధ్యతలన్నీ నవాబులమీదనే యుంటూవున్నా దానివలని లాభాలన్నీ కంపెనీవారికే గలుగుతూవుండేవి. నవాబుసర్కారు వుద్యోగుల నందరినీ కంపెనీవారు తమ శిస్తువసూలు వ్యవహారాలలో బాగా వుపయోగించుకునేవారు. ఇలాగ వంగరాష్ట్రంలో కొంతకాలము ద్వంద్వ ప్రభుత్వం నడిచించి. ప్రభుత్వ వ్యవహరాలు జరపడానికని కంపెనీవారిచ్చే సొమ్ము చాలక నవాబు చాలా చిక్కులు పడేవారు.
ఈవిధానంవల్ల ప్రభుత్వ బాధ్యతలు లేకుండా అధికారాలన్నీ కంపెనీవారు చలాయిండానికి వీలుకలుగుతుం దనిన్నీ, తక్కిన పాశ్చాత్యులకు కన్నుకుట్ట కుండా వుంటుందనిన్నీ కంపెనీవారికి సాలుకు 122 లక్షల రూపాయల నికరాదాయం వస్తుందనిన్నీ 1766 వ సంవత్సరం సెప్టెంబరు 30 వ తేదీన క్లైవు సీమకు వ్రాశాడు. ఈదివానిగిరీ వల్ల ఇంగ్లీషు వర్తకకంపెనీవారు మొగలాయి చక్రవర్తికింద దివానుగా రాజప్రతినిధి హోదాను కలిగి వంగరాష్ట్రానికి నిజమైన పరిపాలకులైనారు. క్రమక్రమంగా అధికారాలన్నీ కంపెనీవారే చలాయించడానికి అవకాశం కలిగించి. పేరునకు నవాబు రాజ్యం చేస్తున్నాడు గాని సాక్షాత్తుగా పరి పాలించేది కంపెనీవారే. 1772 లో వారన్ హేస్ఠింగ్సు గవర్నరైన తరువాత ఈ ద్వంద్వ ప్రభుత్వ నాటకాన్ని రద్దుచేసి నవాబుకి 16 లక్షల మనువర్తినిచ్చి కంపెనీవారే ప్రభుత్వం చేసేపద్దతిని స్థాపించాడు. వంగరాష్ట్రంలో నవాబు స్థానే కంపెనీవారే రాజప్రతినిధులై పరిపాలన చేయసాగినారు.
హిందూదేశంలో మహారాష్ట్రులు బలవంతులై దేశాక్రమణ చేస్తూ దేశాలను కొల్ల గొట్టుకుంటూ వున్న కాలంలో వారు మొగలాయి చక్రవర్తిని పట్టుకుని తమ వశంలో వుంచుకున్నారు. 1771లో మొగలాయి చక్రవర్తిని ఢిల్లీసింహాసనము మీద నిలిపి ఆ మొగలాయిచక్రవర్తి పేరున తాము దేశపరిపాలన ప్రారంభించారు. ఆ