చక్రవర్తికి శిక్షవిధించిన దివానులు
29
వుండినందువల్ల వారికి అమితలాభం కలిగించి. త్వరలోనే మీర్జాఫరును అతని కొమారుణ్ణికూడా త్రోసిరాజని అతని అల్లుడైన మీర్జాసీమమును నవాబుగా చేశారు. ఇతడు మీర్ఝాఫరులాగ ఇంగ్లీషు వర్తకులుచేసే అన్యాయాలన్నింటినీ సహించలేక వారికి గల ప్రత్యేక హక్కులను తీసివేసేటప్పటికి ఇంగ్లీషు వారాయనను పదభ్రష్టుణ్ణి చేసి మళ్లీ మీర్జాఫరును తక్తుమీదికి యెక్కీంచారు.
1760-1764 మధ్య వంగరాష్ట్రంలో అరాజకం ప్రబలింది. ఇంగ్లీషు వర్తకులు చేసే అన్యాయాలకు మితిలేకుండా పోయించి. వారి దుర్మార్గాలు సీమలో అధికారులకు కూడా తెలిసి ఇక్కది పరిస్థితులను చక్క బెట్టవలసిన దని క్లైవును మళ్లీ గవర్నరుగా నియమించి పంపించారు. అతడు 1765 మే నెలలో ఇక్కడికి వచ్చాడు.
ఈలోపుగా వంగరాష్ట్ర రాజకీయ పరిస్థితులలో కొన్ని మార్పులు వచ్చినవి. పదచ్యుతుడైన మీర్జాసీము అయోధ్య నవాబును ఆశ్రయించాడు. అంతట అయోధ్య నవాబున్నూ, షా ఆలం చక్రవర్తిన్నిఈ అతనికి సహాయులైనవారు. 1764 లో బక్సారువద్ద జరిగిన యుద్ధములో వారికి అపజయం కలిగినందువల్ల కంపెనీవారి సైన్యాలు అయోధ్యమీదికి చెలరేగి దండయాత్రలు చేయడం ప్రారంభించినవి. క్లైవు వచ్చేటప్పటికి అయోధ్యలో యుద్ధం పూర్తి అయింది. మీర్జాఫరు 1765 జనేవరు లోనే మరణించాడు.ఇక్కడి కంపెనీ యుద్యోగులు అతడి రెండవకొడుకుదగ్గర లంచములు పుచ్చుకొని అతణ్ని నవాబును చేశారు.
వంగరాష్ట్ర సింహాసనం మీద ఓక బలహీనమైన నవాబును నిమిత్తమాత్రంగా వుంచి కీలుబొమ్మలాగు ఆడించినందువల్ల ఇంగ్లీషు కంపెనీ వుద్యోగులందరికీ వారు ఆడింది ఆటగానూ, పాడిందిపాటగానూ, సాగింది. వారు పుచ్చుకునే లంచాలకు జరిగించే అక్రమాలకు హద్దు పద్దు లేకుండా పోయింది.