ఏనుగుల వీరాస్వామయ్యగారి
కాశీ యాత్ర చరిత్ర
నూటపాతికేండ్ల నాటి భారతదేశ స్థితిగతులను గూర్చి
వర్ణించు అపూర్ఫమైన చరిత్ర గ్రంధము
డెమ్మీసైజు
500 పుటలు
చక్కని అచ్చు
సంపాదకుడు: ది గ వ ల్లి వేం క ట శి వ రా వు.
వెల: చందాదారులకు రు.1-8-0.
ఇతరులకు రు.2-0-0
శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి అభిప్రాయం
"నూటయిరవై యేండ్లక్రిందట చెన్నపట్టణమందుండే సుప్రీం కోర్టులో ఇంటర్ ప్రిటర్ హోదాలో గొప్ప అధికారంవహించి చాలా పలుకుబడి గలిగి, తన విద్య చేతను ధర్మము చేతను శీలము చేతను త్యాగముచేతను అసాధారణపురుషు డని కీర్త్రి పొందిన ఏనుగుల వీరాస్వామయ్యవారు సకుటుంబముగాను సపరివారముగాను కాశీయాత్ర పోయినప్పుడు తాను చూచిన దేశములు, నగరములు, పల్లెలు, అందుండే నానాజాతుల మనుష్యులు వారి వృత్తులు ఆచారములు మొదలయిన విషయములు సవిస్తరముగా వర్ణిస్తూ దినచర్య రచించినాడు. అతని మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళ అనే ఆయన గవర్నమెంటువారి ఉత్తరువు ప్రకారము ఈ గ్రంధము 1838 వ సం॥లో అచ్చు వేయించి ప్రకటించినాడు. (డెమ్మీ 8 వ వంతు సైజులో చిన్న అచ్చులో) 328 పుటలు గలిగి ఉన్నది. గ్రంధకర్త చరిత్రకూడా పిళ్ళగారు రచించి చేర్చినారు--- గ్రంధకర్త పాండిత్యము లోకజ్ఞానము గ్రంధమంతా చదివితేకాని తెలియదు."
1838 లో అచ్చైన ఈ పుస్తకముయొక్క ప్రతులు ఇప్పుడు చదవడానికైనా ఎక్కడా దొరకడం లేదు. ఏమారుమూలనైనా తలవని తలంపుగా ఒక ప్రతిదొరికినా దానిలోని పుటలు త్రిప్పితేనే నుసిఅయిపొయేటంత పాతబడి పెళుసెక్కి వున్నాయి. వీరాస్వామయ్యగారు 1832 ఆ ప్రాంతంలో సి.పి.బ్రొను దొరగారికి వ్రాయించి పంపిన పుస్తకం వ్రాతప్రతియొకటి చెన్నపట్టణం ఓరియంటల్ మాన్యూస్క్రిప్టు లైబ్రరీలో ఉందిగాని అది చదవడానికి అక్కడకు వెళ్ళి కొన్నాళ్ళు ఉండాలి. అందువల్ల ఈగ్రంధము, మంచి కాగితములపైన చక్కగా