ముద్రింపబడుచున్నది . ఇది పెద్ద అచ్చులో డెమ్మీసైజున 500 పుటలుంటుంది.
పుస్తకం రచియింపబడిన నాటికీ నేటికీ మనదేశ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి అందువల్ల అప్పట్లో వీరాస్వామయ్యగారు తన కాలమునాటి వారందరికీ తెలిసిన సంగతులే యని విపులముగా వ్రాయక సూచించి వదలిన రాజకీయ సాంఘిక చారిత్రక అంశము లనేకము లిప్పుడు విప్పి చెప్పితేనే గాని అర్ధంకావు. ఉదాహరణానికి తిరుపతి దేవస్థానం వల్ల కుంఫినీవారికి ప్రతిసాలున లక్షరూపాయిలు ఆదాయం వస్తున్నదని ఆ గ్రంధంలో వ్రాసివున్నది. ఆ కాలంలో మన ధర్మాదాయా లన్నీ కుంఫినీవారే స్వయంగా పరిపాలించే వారనిన్నీ భోగములు అర్చనలు కలెక్టర్లే చేయించే వారనిన్నీ మిగిలిన సొమ్ము కుంఫినీ ఖజానాలో చేరే దనిన్నీ ఆ కాలమునాటి చరిత్ర చదివితే తప్ప తెలియదు. ఇలాంటి చరిత్రాంశము లన్నటికీ తగిన వివరణములు, తబ్సీలు, వ్రాయబడినవి.
వీరాస్వామయ్యగారి పర్యటనమును తెలుపగల ఒక హిందూదేశ పటము దీనిలో చేర్చబడినది. శ్రీ వీరాస్వామయ్యగారి యొక్కయు, ప్రజాసేవయందు వీరికి తోడ్పడిన వీరి మిత్రులైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారు, వెంబాకం రాఘవాచార్యులుగారు, జార్జి నార్టనుగార్ల యొక్కయు చిత్రపట మొకటి దీనిలో చేర్చబడినది.
1824-1826 మధ్య కలకత్తాలో కుంఫినీవారి కొలువులో ప్రధాన క్రైస్తవమతాధికారిగా నుండిన బిషప్ హెబరుదొర భారతదేశములో పర్యటనము చేసి తాను చూచిన సంగతులను తన దినచర్యలోను తన భార్యకు స్నేహితులకు వ్రాసిన ఉత్తరాలలోను వ్రాసియున్నాడు. ఇది బిషప్ హేబర్సు జర్నల్ అని మూడు సంపుటములుగా ప్రకటించబడి ఆ కాలంనాటి హిందూదేశ చరిత్రను గూర్చిన ప్రమాణ గ్రంధముగా పూజింపబడుతూ వున్నది. మన వీరాస్వామయ్యగారి గ్రంధం ఆ గ్రంధాని కేవిధంగాను తీసి కట్టుకాదు. సందర్భానుసారంగా హెబరుగారి గ్రంధంలో నుండి కొన్ని సంగతులీ గ్రంధంలో అక్కడక్కడ ఉదాహరింప బడినవి.
వలయువారు:-
దిగవల్లి వేంకట శివరావు, బెజవాడ, అని వ్రాయవలయును.
షరా:--చందాదారులు అచ్చుపూర్తయ్యేలోగా రు.1-0-0 చెల్లించవలెను.
ఏ.జి. ప్రెస్, బెజవాడ.