పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగలి కొండోజీ

147


కుటుంబమువారుగాని చెల్లించనక్కరలేకుండా కొండోజీ ఒక ఫర్మానా పొందాడు.

సదాశివరాయలవారి ఆజ్ఞప్రకారం రామరాయలవారు ఈ అదృష్ణశాలికి యుంకొక దానశాసనంకూడా రాయించి యిచ్చారు గాని అందులోని సంగతులు సరిగ్గా తెలియడం లేదు. ఆ కాలంలోనే గూడూరులో వున్న సదాశివరాయలవారి యుద్వోగి ఈ కొండోజికి ఆచంద్రతారార్కంగా అనుభవించగలందులకు ఒక దానశాసనం వ్రాయించి యిచ్చి దానికి ఆటంకం కలిగించేవారికి బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని అందులో వ్రాయించారు.

హీరేకెరూరులో ఒక కవిలెవల్ల రామరాయలవారు 'తిమ్మోజా, హోమ్మోజా, బారోజా ' లనే ముగ్గురు మంగళ్ళపైన పన్నులు తీసివేసినట్లు కనబడుతూ వున్నది. బాదామిలోనున్న ఒకశాసనంవల్ల 'తిమ్మోజా, కొండోజా, భద్ర లనే మొగ్గురు మంగళ్ళకు పన్నులు తీసివేసినట్లున్నూ కనబడుతున్నది.

సదాశివరాయలావారికిన్నీ, రామరాయలవారికిన్ని కొండోజీ యందున్నూ, పైన చెప్పిన ముగ్గురుమంగళ్ల యందున్నూ కలిగిన అనుగ్రహంవల్ల మంగలికులంవారి కందరికీ చాలా వుపకారాలు జరిగినవి. రామరాయల వారికి కొండోజాయందు కలిగిన అభిమానంవల్ల తుముకూరుజిల్లాలో నున్న మంగలి కులస్థు లందరికీకూడా పన్నులు లేకుండా తీసివేసినట్లు 1545 లోని ఒక శాసనంవల్ల తెలుస్తూవుంది. తరువాత విజయనగరరాజ్యం సరిహద్దులోపల గల మంగళ్లందరూ కూడా పన్ను లిచ్చుకో నక్కరలేదని వుత్తర్వు చేశారు. పైని చెప్పిన కారణంవల్లనే సదాశివరాయలవారు ఉలబి గ్రామంలోని మంగళ్లకు వృత్తిపన్నును ఇనాముగా వదలివేసినట్లు చెప్పబడినది.

దరిమిలాను సామ్రాజ్యంలో నున్న మంగళ్లందరికీకూడా అనేక సౌకర్యాలు కలిగించారు. మంగళ్లు ఇచ్చుకోవలసిన పన్నులు, నిర్ణీతపు శిస్తులు, వారు చెయ్యవలసిన వెట్టి చాకిరీ, బిరద, సుంకములు, కావలి