పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

146

కథలు - గాథలు

చేర్చి అనేకకధలు చెప్పుకుంటున్నారు. మన రుద్రకవి కధకూడా ఇలాంటిదే.

'మంగలి కొండోజీ ' పొందిన రాజసన్మానం

రుద్రకవి పేర్కొన్న మంగలికొండోజీ 1545 మొదలు 1565 వరకూ సదాశివరాయలవారి కాలంలో విద్యానగరాన్ని పరిపాలించిన అళియరామరాయలవారి సన్నిహితభృత్యుడు. ఇతడు తనకు బహుపసందుగా ముఖక్షౌవరం చేస్తాడని రాయలవారు సదాశివరాయల వారికి చెప్పగా సదాశివరాయలవారు కూడా కొండోజీని ఆదరించి అతనిమీద అనుగ్రహం కలిగి అతణ్ణి బహుకరించారు. ఈ కొండోజీ పేరు "బాడవిపట్టణ కాపురస్తుడైన మంగలి తిమ్మొజు కొండోజు*[1] గారు" అనిన్నీ, "కొండోజా" అనిన్నీ సదాశివరాయలవారి దానశాసనాలలొ కనబడుతున్నది. 1545 నాటికే రామరాయలవారికి కొండోజీ పైన అనుగ్రహం కలిగి మంగళ్ళు మామూలుగ చెల్లించవలసిన వృత్తి పన్నును, సుంకములును ఇతరపన్నులన్నూ అతడిచ్చుకో నక్కరలేకుండా ఒక తాకీదు జారీచేశారు. రాజ్య పరిపాలకుడి చర్యను చూసి మైసూరు రాజప్రతినిధి రాజ్యంలో చేరిన శివమొగ్గ జిల్లాలొ సదాశివరాయలవారి యుద్యోగి (ఏజంటు) ఈ కొండోజూకు చన్నగిరి మంగలి పన్నును ఇనాముగా నిచ్చారు.

కొండోజు రామరాయలవారికి సేవచేస్తూవుండి రాయలవారిని ఆశ్రయించినందువల్ల మంగలికులస్ధు లెవ్వరూ పన్ను లిచ్చుకో నక్కర లేకుండా సదాశివరాయలవారు 1554 లో శాసించారు. ఆ మరుసటి సంవత్సరం వెట్టిచాకిరీ., బిరద, నిర్ణీతపు శిస్తులున్నూ, ఇతరపన్నులున్నూ కూడా విజయనగర సామ్రాజ్యపు సగిహద్దులోపల తానుగాని, తన

  1. ఓరా అనేది ఒజ్జ శబ్దానికి రూపాంతరము. దీనిని సాధారణంగా కంసాలులూ, మంగళ్ళూ ఉపయేగిస్తారు. ఉత్తర హిందూస్థానంలో ఓఝూఅనే రూపంవున్నది. అన్నింటికీ ఉపాధ్యాయుడనే అర్దం 'అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గాదు చెప్పారు.