134
కథలు - గాథలు
తరువాత కందనూరినవాబు రాజ్యంలో చేరిన బండత్కూరు మీదుగా వెలపనూరు చేరారు. ఇక్కడ నవాబుతరపు ఉద్యోగస్థులు కొందరు ఉన్నారు. అటుతరువాత ఆయన ఆత్మకూరు చేరారు. ఇది ఆ నవాబు తాలూకు ఉద్యోగస్థులు వుండే కసుంబాబస్తీ. శ్రీశైలయాత్ర చేయవచ్చిన వారిదగ్గర హాశ్శీలు పుచ్చుకునే నవాబు ముసద్దీలు ఆత్మకూరులో వున్నారు. నవాబుపరిపాలనను వీరాస్వామయ్యగారు ఇలాగ వర్ణించారు. 'తాలూకా నాలుగు మేటీలుగా పంచి ఒక్కొక్క మేటీకి ఒక్కొక్క అములుదారుని ఏర్పరిచాడు. ఈ అములు దార్లందిరి పైన అక్బరునవీసు అనే అధికారిని నియమించాడు. నవుకర్లకు జీతానికి జాగీరు లిచ్చాడు. కుంఫినీవారికి సాలుకు లక్షరూపాయిలు కప్పం కడతాడు. అతని రాజ్యము బళ్లారిజిల్లా కలెక్టరు ఆజ్ఞకు లోబడినది. కలెక్టరుతరపున ఒక వకీలు కందనూరులొ కాపుర మున్నాడు. నవాబు కాజీకొర్టు పెట్టి న్యాయవిచారణచేస్తాడు. కుంఫినీకోర్డులకు నిమిత్తంలేదు. నవుకర్లకు జీతాలు స్వల్పము - సరిగా ఇవ్వడం లెదని వాడుక(పుట12)
శ్రీశైలం దేవస్థానము
శ్రీశైలయాత్రకు తీసే హాశ్శీలు కందనూరి నవాబుకు చేరుతున్నదనిన్నీ, ఉత్సవాని కయ్యే ఖర్చుగాక హశ్శీలుకూడా పుచ్చుకుంటారనిన్నీ చెప్పి వాటి వివరాలను వీరాస్యామయ్యగారు ఇలాగు వ్రాశారు.
'సిద్ధాపురంలో చెంచువాండ్లకుగాను నవాబు మనుష్యులు మనిషి ఒకటికి 3 డబ్బులు హాశ్శీలు పుచ్చుకొంటున్నారు. పరషవారి (యాత్రికుల)వద్ద నవాబు సరకారు ఆజ్ఞప్రకారం మనిషి 1 కి 3 డబ్బులు హాశ్శీలు పుచ్చుకున్నా కిరాతకుల నాయకుడు ధర్మాత్ముడుగానే వున్నాడు. కందనూరునవాబు వగైరాలు పల్లకీలమీదనే శ్రీశైలమునకు వెళ్ళియున్నారు.
'శ్రీశైలంగుడి హాశ్శీలుమూలముగా సంవత్స్దరం ఒకటికి 18000 కందనూరునవాబుకు వచ్చినా, గుడి యేగతిని పొందేదిన్నీ విచారింపడు. ఎవరైనా మరమ్మతు చేసినట్లయితే సెలవంత హాశ్శీలు తీసుకొను