కందనూరు నవాబు రాజరికం
135
చున్నాడు. రాజాచందులాలా యీ నిర్భంధంచేత కొంత మరమ్మతుచేసి విడిచినాడు. మైసూరునుంచి వచ్చేవాళ్ళకు హాశ్శీలు లేదు. గుడిలో ఏపక్కచూచినా అడివి పెరిగివున్నది. వ్యాఘ్రభూయిష్ఠము. అడివినికొట్టి చక్కచేసే దిక్కులేదు. స్వామికిన్నీ, దేవికిన్నీ ఎవరైనా ఆభరణాలూ, వస్త్రాలు సమర్పిస్తే వాటి మదింపంత రూకలు హాశ్శీలు పుచ్చుకొవడమే గాకుండ కొన్ని దినాలు పోనిచ్చి ఆవస్తువులనే ఆ కందనూరు నవాబు అపహరిస్తున్నాడు ' (పుటలు 15-19)
వీరాస్వామయ్యగారు నివృత్తిసంగమానికి వెళ్ళారు ఇది కొండక్రింద నున్నది. కృష్ణ ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నది. ఆయూరున్నూ కందనూరు నవాబుదే. కృష్ణకు యీవలిపక్క వరకూ కందనూరువారి రాజ్యం, ఆవలిపక్క హైదరాబాదువారి రాజ్యము. అందువల్ల కృష్ణ దాటడానికి మనిషి కింత అని కందనూరివారు ఇవతలిపక్కా, హైదరాబాదువారు అవతలపక్కా హాశ్శీలు పుచ్చుకుంటున్నారు.(ఇంకావివరాలకు వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర చూడండి)
దక్షిణదేశ రాజకీయాలు
మొగలాయిచక్రవర్తుల క్రింద దక్షిణదేశానికి పరిపాలకుడుగా నుండిన హైదరాబాదు సుభాదారుడే ఇంగ్లీషు ప్రభుత్వమువారికి నమ్మిన స్నేహితుడైన ఘనత వహించిన నిజాంప్రభువు అయినాడు. మొగలు సామ్రాజ్యం అస్తమించిన తరువాత ఇంగ్లీషుపరిపాలనలొ దక్షిణ హిందూదేశంలో వున్న మహమ్మదీయ రాజ్యాలపైన నిజాముగారి అధికారం పోయినా చాలాకాలంవరకూ ఆయనకు మంచి పలుకుంబడి వుంటూవుండేది.
1889 మొదలు హైదరాబాదురాజ్యానికి నిజాముప్రభు వైన నాజర్ ఉద్దౌలా అనేఆయన ఇంగ్లీషువారిపట్ల స్నేహభావంతోనే ఫుండేవాడు. ఆయన మంత్రి రాజ్యతంత్రనిపుణుడైన రాజా చందూలాలా అనే బ్రాహ్మణుడు. ఇంగ్లీషుకుంఫినీవారికి మిత్రుడుగా వుండేవాడు. అయితే నిజాంప్రభువుగారి సోదరుడికి మాత్రం ఇంగ్లీషువా రంటే అసహ్యం. ఆయన కుంఫినీవారికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూవున్నట్లు ఇంగ్లీషు