కందనూరు నవాబు రాజరికం
129
బిజాపూరురాజ్యభాగాలను కొన్నింటిని ఆక్రమించుకుని కొన్నింటిని దోచుకోవడంలో కర్నూలును కూడా దోచినాడు. తరువాత కొద్ది కాలంలోనే మొగలాయి చక్రవర్తియైన షాజహాను సైన్యాలు దక్షిణాపధంమీదికి దండేత్తి వచ్చి బిజాపూరు రాజ్యభాగాలను కొన్నింటిని ఆక్రమించుకున్నవి. క్రమక్రమంగా దక్షిణా పధంలోని రాజ్యాల నన్నింటినీ కూడా జయించి మొగలుసామ్రాజ్యంలో చేర్చినవి.
కం ద నూ రి న వా బు లు
1687 లో మొగలు చక్రవర్తియైన ఔరంగజేబు పాదుషా గోలకొండను, కృష్ణానదికి దక్షిణాన వున్న రాజ్యాలను జయించాడు. అప్పుడు ఆయన సేనాపతులలో ఒకడైన గయాజుద్దీను కర్నూలును పట్టుకున్నాడు. తరువాత ఈ మండలాన్ని మొగలుచక్రవర్తి తన సేనాధిపతియైన దావూదుఖాను బహద్దరుకు జాగీరుగా యిచ్చాడు. అతని తరువాత 1733 లో జాగీరుదారుడైన హిమాయతుఖాను 'నవాబు ' అనిపించుకున్నాడు, ఇతని కాలంలో 1741 లో మరాటీదండు వచ్చి దేశాన్ని కొల్లపెట్టింది. దీనినిగురించిన పాటలు ఇప్పటికీ పాడుతూ వుంటారు.
కర్ణాటకనవాబుల వారసత్వంతగాదాలలో హిమాయతుఖాను ఒకమాటు ఇంగ్లీషువారి పక్షాన్ని యింకొకమాటు ఫ్రెంచివారి పక్షాన్ని చేరినాడు. అప్పట్లో నలబతుజంగున్నూ, ఫ్రెంచిసేనానియైన బుస్సీదొరయున్నూ, కలిసి 1751 మార్చిలో కర్నూలును ముట్టడించారు. హిమాయతుఖాను తమ్ముడైన మునవరుఖాను కర్నూలు నవాబు అయినాడు. అతని కాలములో మైసూరుసుల్తాను హైదరాలీ (1755) కర్నూలుమీదకి దాడివచ్చి రెండులక్షలు కప్పంగా పుచ్చుకున్నాడు. మునవరుఖారు 1792 లో చనిపోగా అతని మూడవకొమారుడైన అలూఫ్ ఖాను నవాబు అయినాడు.
తరువాత 1799 లో హైదరాలీ కొమారుడైన టిప్పుసుల్తాను యుద్ధంలొ ఓడిపొయి చనిపోగా బళ్ళారి కడపజిల్లాలతోపాటు ఈజిల్లా కూడా ఇంగ్లీషువారికి సహాయుడైన హైదరాబాదు నిజాముపాలికివచ్చింది.