Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నాయి కాని అంతకు పూర్వపు చరిత్రవివరాలు తెలియడం లేదు. అయితే ఈ దేశాన్ని పూర్వము చాళుక్యులూ, చోళులూ, ఓరుగంటి కాకతీయగణపతిరాజులూ ఏలినట్లు నిదర్శనాలున్నాయి. 1565 లో తాళికోట అనే రాక్షసతగ్డి యుద్ధంలో విజయనగర ప్రభువయిన అళియరామరాజు ఓడిపోవడంతో గెల్చినపక్షంలో చేరిన తురకరాజైన గోలకొండ సుల్తాను కుతుబుశాహీ ఈ రాజ్యం మీదికి దండెత్తి వచ్చారు. తరువాత ఇతర మహమ్మదీయ రాజులుకూడా దేశం కొల్లపెట్టారు.

తాళికోట యుద్ధంయొక్క ఫలితంగా కర్నూలుమండలంలో తూర్పు భాగాలు గోలకొండసుల్తానుగారి వాటాకూ పడమటి భాగాలు బిజాపూరుసుల్తానుగారి వాటాకూ వచ్చినవి. ఆసుల్తానులు తమ తమ వాటాలను స్వాధీనపర్చుకోవడానికి సైన్యాలు పంపి యుద్ధాలు చేయడంతో కొంతకాలం గడచింది. పడమటి భాగాలు సులభంగానే లొంగినట్లు కనబడినా అక్కడ బిజాపూరుసుల్తానుగారి ప్రభుత్వం నిమిత్తమాత్రంగానే వుండేది. తూర్పుభాగంలో కంభం, కొండవీడు మొదలైన ప్రాంతాలపాళెగార్లు గొలకొండసుల్తానుగారికి సులభంగా లొంగక చాలాకాలం యుద్ధంచేశారు. శిరివెళ్ల, చెన్నూరు, నంద్యాల, ముసలిమడుగు మొదలైన ప్రాంతాలు కూడా గోలకోండసుల్తానుకు లోబడినవి.

క్రీస్తుశకం పదహారవశతాబ్ధంలో బిజాపురం సుల్తాను సామంతుడైన అబ్దుల్ వాహబుఖాను కర్నూలుమీదికి దండయాత్ర చేసి అప్పట్లో ఆప్రాంతాలను పరిపాలిస్తూ వుండిన విజయనగర రాజ బంధువున్నూ రామరాయల మనుమడున్నూ అయిన గోపాల ................... కర్నూలులొ తనప్రభుత్వం స్థాపించాడు. ఇతడు ................కొన్ని వ్యాపింపజెయ్యాలనే వుద్దేశ్యంతో అనేక ఆలయాలను పడగొట్టి మశీదులను కట్టించాడు. అతని తరువాత ........................ మహమ్మదు నవాబు అయి1686 వరకూ రాజ్యం .................................కాలంలోనే అనాగా 1677 లో ఛత్రపతి శివాజీ